రేపు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ సంబరాలు

కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపాలనే ప్రయత్నాన్ని ఆపినందుకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు చేయాలని శ్రేణులకు మాజీ మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు.

Advertisement
Update:2024-10-29 14:55 IST

రేపు తెలంగాణ వ్యాప్తంగా సంబురాలు జరపాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కరెంట్ చార్జీలు పెంచి ప్రజలపై రూ.18,500 కోట్ల విద్యుత్ ఛార్జీల భారాన్ని మోపాలనే ప్రయత్నాన్ని ఆపినందుకు జిల్లా కేంద్రాలు, నియోజకవర్గాల్లో సంబరాలు చేయాలని శ్రేణులను కేటీఆర్ కోరారు. పది నెలల కాలంలోనే 18500 కోట్ల విద్యుత్‌ ఛార్జీల పెంపునకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందని కేటీఆర్‌ అన్నారు. ప్రజలపై విద్యుత్‌ భారం మోపడాన్ని ప్రధాన ప్రతిపక్షంగా వ్యతిరేకించామని తెలిపారు. పబ్లిక్‌ హియరింగ్‌లో పాల్గొని దీనిపై ఈఆర్సీపి ఒప్పించలిగామని చెప్పారు. ప్రధాన ప్రతిపక్షంగా తమ వాదనలోని సహేతుకత, న్యాయాన్నిను ఈఆర్సీ గుర్తించి కరెంట్ బిల్లుల పెంపు ప్రతిపాదనను తిరస్కరించిందని అన్నారు.

విద్యుత్‌ పెంపు ప్రతిపాదనలను తిరస్కరించినందుకు ఈఆర్సీ చైర్మన్ శ్రీ రంగారావు, స‌భ్యులు మనోహర్ రాజు, కృష్ణయ్య‌కు తెలంగాణ ప్రజల తరపున మాజీ మంత్రి కేటీఆర్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ మేర‌కు కేటీఆర్ ట్వీట్ చేశారు. విద్యుత్ చార్జీల పేరిట రూ. 18,500 కోట్ల అదనపు భారం ప్రజలపై మోపడాన్ని హైదరాబాద్, నిజామాబాద్, సిరిసిల్లలో నిర్వ‌హించిన మూడు బహిరంగ విచారణలలో తాము తీవ్రంగా వ్య‌తిరేకించామ‌ని కేటీఆర్ తెలిపారు. ఇది తెలంగాణ ప్ర‌జ‌ల విజ‌యం అని కేటీఆర్ పేర్కొన్నారు.

Tags:    
Advertisement

Similar News