చేతివృత్తులకు కేంద్రం చేయూత

చేతివృత్తులపై జీవించే వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

Advertisement
Update:2024-10-27 13:33 IST

సమాజంలో చేతివృత్తులు కనుమరుగవుతున్నాయని, వారికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లోని కవాడీగూడ లోయర్‌ ట్యాంక్‌ బండ్‌లో రూ. 26 లక్షల వ్యయంతో దోబీ ఘాట్‌ కమ్యూనిటీ హాల్‌ నిర్మాణానికి కేంద్ర మంత్రి భూమిపూజ చేశారు. అత్యాధునిక సంకేతిక పరిజ్ఞానం విస్తరిస్తున్న నేపథ్యంలోనూ చేతి వృత్తులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న రోజుల్లో అన్నిరకాల చేతివృత్తులను ముద్రా యోజన కిందా లేదా స్వనిధి యోజన కింద లేదా విశ్వకర్మ యోజన కింద అయినా చేతివృత్తులపై జీవించే వారి ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. వారి కుటుంబాలకు ఆర్థికంగా ఒక ధైర్యాన్ని కల్పిస్తామన్నారు. అలాగే వాళ్లుకు అవసరమైన నూతన నైపుణ్య శిక్షణ అందిస్తామన్నారు. రానున్న రోజుల్లో సికింద్రాబాద్‌ నియోజకవర్గంలో ఆ దిశగా శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తామని కేంద్రమంత్రి తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News