ఫీజు రీయింబర్స్ మెంట్‌ కోసం ప్రభుత్వంపై మిలిటెంట్ పోరాటాలే

రేవంత్ రెడ్డి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి ధ్వజం

Advertisement
Update:2024-10-23 13:49 IST

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్‌, స్కాలర్షిప్ బకాయిలు వెంటనే విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్యం చేస్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై మిలిటెంట్ పోరాటాలు చేస్తామని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి హెచ్చరించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారం రావడానికి విద్యార్థులు వారి తల్లిదండ్రులు సహకారం ఉందన్న విషయం రేవంత్ రెడ్డి గుర్తు పెట్టుకోవాలన్నారు. ఫీజు బకాయిల విడుదల పై నాడు రేవంత్ రెడ్డి చెప్పింది ఏమిటి? నేడు చేస్తున్న జాప్యం ఏమిటని ప్రశ్నించారు. ఫీజు బకాయిలను 27లోపు విడుదల చేయకపోతే చలో ఇందిరాపార్క్ నిర్వహిస్తామన్నారు. వేలాది మంది విద్యార్థులతో హైదరాబాద్ దిగ్బంధం చేస్తామని, సచివాలయం ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు

ఈరోజు ఏఐఎస్ఎఫ్ కరీంనగర్ జిల్లా కౌన్సిల్ ఆధ్వర్యంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్‌, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు తెలంగాణ చౌక్ నుంచి ర్యాలీగా కలెక్టరేట్ కి వెళ్లి అక్కడ గేటు ముందు బైఠాయింరారు. విద్యార్థుల నినాదాలతో కలెక్టరేట్ సుమారు అర్థగంట సేపు దద్దరిల్లింది

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ... విద్యార్థులు వారి తల్లిదండ్రుల ఇబ్బందులు, సిబ్బందికి జీతాలు ఇవ్వలేక భవన కిరాయిలు చెల్లించలేక ప్రైవేట్ డిగ్రీ,పీజీ ఇంజనీరింగ్ ఫార్మసీ కళాశాలల యాజమాన్యాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత మూడేళ్ల నుండి ఫీజుబకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు నాలుగు రోజులు బంద్ చేశాయి. అయినా ప్రభుత్వం బకాయిలు విడుదల చేయకుండా పెడచెవిన పెట్టడం సిగ్గు చేటన్నారు. గత ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నదని అని మాట్లాడి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలు మొత్తం ఒకే సారి విడుదల చేస్తామన్నారు. ఆనాటి పీసీసీ అధ్యక్షుడు , నేడు సీఎం అయిన రేవంత్‌ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి పది నెలలు కావస్తున్న ఇప్పటికీ ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. వెంటనే ప్రభుత్వం పెండింగ్ లో ఉన్న ఫీజు బకాయిలు టోకెన్ ఇచ్చినవి కాకుండా పెండింగ్ లో ఉన్న బకాయిలు మొత్తం ఒకే సారి విడుదల చేయాలన్నారు. లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఫీజు బకాయిల విడుదల అయ్యే వరకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చలో సచివాలయం నిర్వహిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, కార్యదర్శి రామరాపు వెంకటేష్, మచ్చ రమేష్, జిల్లా ఆఫీస్ బేరర్స్ మామిడిపల్లి హేమంత్,కేశబోయినా రాము,కనకం సాగర్, లద్దునూరి విష్ణు, నగర నాయకులు కసిరెడ్డి సందీప్ రెడ్డి, కౌశిక్, ఛత్రపతి, వినయ్,శ్రావణ్,ఈశ్వర్,రిషి తదితరులు పాల్గొన్నారు

Tags:    
Advertisement

Similar News