హన్‌ నది పునరుజ్జీవన ప్రాజెక్టును సందర్శించిన మంత్రులు

సియోల్‌ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలకు కీలకంగా మారిన ఈ నది

Advertisement
Update:2024-10-22 10:22 IST

సౌత్‌కొరియా రాజధాని సియోల్‌లో తెలంగాణ మంత్రుల పర్యటన కొనసాగుతున్నది. ఆ దేశంలోని ముఖ్యమైన హన్‌ నది పునరుజ్జీవన ప్రాజెక్టును మంత్రులు, అధికారుల బృందం పరిశీలించింది. సియోల్‌ నగరంలో నీటి సరఫరా, పర్యావరణం, ఆర్థిక వ్యవస్థలకు ఈ నది కీలకంగా మారింది. కాలుష్యానికి గురైన హన్‌ నదిని శుభ్రం చేసి దక్షిణకొరియా ప్రభుత్వం పునరుద్ధరించింది. మొత్తం 494 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ నది ఆ దేశ రాజధాని సియోల్‌ నగరంలో 40 కి.మీ. మేర ప్రవహిస్తుంది. ప్రక్షాళన అనంతరం శుభ్రంగా మారి ఇప్పుడు సియోల్‌ నగరానికి ఒక ముఖ్యమైన పర్యాటక ప్రదేశం, జలవనరుగా మారింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, పురపాలకశాఖ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు ఈ నదిని పరిశీలించారు. 

Tags:    
Advertisement

Similar News