హైదరాబాద్‌‌లో జోరు వాన ..ఫుల్ ట్రాఫిక్ జామ్

Heavy rain in Hyderabad.. Full traffic jam

Advertisement
Update:2024-10-10 18:12 IST

హైదరాబాద్‌ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం నుంచి మామూలుగా ఉండి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. దీంతో మోస్తరు వర్షం కురిసింది. రోడ్లన్నీ జలమయం అయినవి. దీంతో ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. ఇవాళ సద్దుల బతుకమ్మ కావడంతో అటు వర్షంతో రోడ్డుపై వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరాయి .జూబ్లీహిల్స్, మాదాపూర్,యూసఫ్‌గూడ, కీసర, ఘట్‌కేసర్, నాంఫల్లి, అబ్ధుల్లాపూర్‌మేట్, ఖైరతాబాద్, దిల్‌సుఖ్‌నగర్, తదితర ప్రాంతాల్లో జోరు వాన పడుతుంది.

ట్యాంక్‌బండ్‌పై రాష్ట్ర ప్రభుత్వం తరఫున వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ట్యాంక్‌బండ్‌ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు.అమరవీరుల స్మారకస్థూపం నుంచి అప్పర్‌ ట్యాంక్‌బండ్‌లోని బతుకమ్మ ఘాట్‌ వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని చెప్పారు. సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 11 గంటలకు ఆంక్షలు కొనసాగుతాయని వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News