సీఎం రేవంత్‌కు చాడీలు చెప్పే వాళ్ళు ఎక్కువయ్యారు : వీహెచ్
People calling CM Revanth more and more: VH
సీఎం రేవంత్‌రెడ్డిపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంత రావు హాట్ కామెంట్స్ చేశాడు. ముఖ్యమంత్రికి చాడీలు చెప్పేటోళ్లు ఎక్కువయ్యారని వీహెచ్ అన్నారు. నా రాజకీయ జీవితంలో బీసీల గురించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ మాట్లాడినట్టు ఎవ్వరు మాట్లాడలేదన్నారు. బీసీల పట్లా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ది ఉందని వీహెచ్ అన్నారు. జనాభా ప్రతిపాదికన ఎవరి దక్కే ఫలాలు వారికే దక్కాలని రాహుల్ అనాడే చెప్పాడని ఆయన అన్నారు. బీసీలకు ప్రత్యేక మినిస్ట్రీని ఇవ్వాలని ప్రధాని మోదీని కోరిన పట్టించుకోలేదని వీహెచ్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణలోని ఆరు గ్యారెంటీలతోపాటు బీసీ కులగణన చేపడతామని పేర్కొన్నారు. నవంబర్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ అనగానే రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరించి గెలిపించారని తెలిపారు.
బలహీన వర్గలు ఓట్లేస్తేనే ఎమ్మెల్యేగా గెలిచావు అని మంత్రి ఉత్తమ్‌కు చెప్పాని.. ఉత్తమ్ కూడా ఒప్పుకున్నాడని తెలిపాడు. బీసీ కులగణన బాధ్యత సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ పైన ఉందన్నారు.తెలంగాణ అసెంబ్లీలో బీసీ కులగణన బిల్ పాస్ అయ్యింది. త్వరలోనే మనకు న్యాయం జరుగుతుంది. త్వరగా బీసీ కులగణన చేస్తేనే మన నాయకుడు మాట్లాడగలడు. మీ రాష్ట్రాల్లో ఎందుకు కులగణన చేయలేదు అని అడుగుతారు. కులగణన ఆలస్యం చేస్తే రాహుల్ గాంధీ పార్లమెంట్ లో సమాధానం చెప్పలేడు అని వీహెచ్ పేర్కొన్నారు.