నీట్ కౌన్సిలింగ్: స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట
రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ
నీట్ కౌన్సిలింగ్‌లో స్థానికత వ్యవహారంలో తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించింది. హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరుకావడానికి తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. విద్యార్థుల భవిష్యత్, ప్రస్తుత సమయాభావం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు సుప్రీంకోర్టు చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం అంగీకారం తెలిపినందున హైకోర్టును ఆశ్రయించిన విద్యార్థులు నీట్ కౌన్సిలింగ్‌కు హాజరయ్యేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీం ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.
స్థానికత వ్యవహారంపై హైకోర్టు తీర్పును రాష్ట్రం ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది. కౌన్సిలింగ్ సమయం అతి తక్కువగా ఉండటంతో ఈ ఒక్కసారికి హైకోర్టును ఆశ్రయించిన 150 మంది విద్యార్థులకు అవకాశం ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు.
స్థానికతను నిర్ధారిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జులై 19న తెచ్చిన జీవో 33వల్ల తమ నివాసిత అంశంపై ప్రభావం చూపిస్తుందని 150 మంది విద్యార్థులు సుప్రీంకోర్టు ఆశ్రయించారు. స్థానికతను నిర్ధారిస్తూ నాలుగు రాజ్యాంగ ధర్మాసనాల తీర్పులున్నాయిని అయినా మళ్లీ కోర్టును ఆశ్రయించారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. దీనిపై విద్యార్థుల తరఫున న్యాయవాది విభేదించారు. కేవలం రెండు , మూడేళ్లు చదువుల కోసం దూరంగా ఉంటే స్థానికతను దూరం చేయవద్దని వాదించారు. మెరిట్స్‌లోకి వెళ్లేంత టైం ఇప్పుడు లేదని రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయం సీజేఐ సూచించారు. కౌన్సిలింగ్ సమయం తక్కువగా ఉండటంతో విద్యార్థులకు అనుమతించాలని నిర్ణక్ష్మీం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాదులు తెలిపారు. తదుపరి విచారణను ప్రతివాదులందరికీ మూడు వారాల్లో సమాధానం చెప్పాలని ధర్మాసనం నోటీసులు జారీ చేసింది.