షర్మిల, జీవన్ రెడ్డిలకు షాక్ ఇచ్చిన‌ ఆత్మహత్య చేసుకున్న నవీన్ కుటుంబం

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు సిరిసిల్లా లోని నవీన్ ఇంటికి వెళ్ళారు. అయితే నవీన్ కుటుంబసభ్యులు ఈ ఇద్దరికీ షాక్ ఇచ్చారు. తమ కుమారుడి ఆత్మహత్యను రాజకీయ స్వార్దం కోసం వాడుకోవద్దని కోరారు.

Advertisement
Update:2023-03-19 18:02 IST

శుక్రవారం ఆత్మహత్య చేసుకొని మరణించిన సిరిసిల్ల పట్టణానికి చెందిన చిటికెన నవీన్‌కుమార్ సంఘటన రాజకీయ మలుపు తీసుకుంది. గ్రూప్ 1 పరీక్షలు రద్దు కావడంతోనే ఆయన ఆత్మహత్యచేసుకున్నాడని విపక్షాలు విమర్శలు మొదలు పెట్టాయి. ఈ ఆత్మహత్యను ఆధారం చేసుకొని ప్రభుత్వంపై దాడికి దిగాయి.

ఈ నేపథ్యంలో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిలు సిరిసిల్లా లోని నవీన్ ఇంటికి వెళ్ళారు. అయితే నవీన్ కుటుంబసభ్యులు ఈ ఇద్దరికీ షాక్ ఇచ్చారు. తమ కుమారుడి ఆత్మహత్యను రాజకీయ స్వార్దం కోసం వాడుకోవద్దని కోరారు. నవీన్ గ్రూప్ 1 ఎగ్జామ్ రాయలేదని, అసలు ప్రిపేరే అవలేదని వారు చెప్పారు.

చెట్టంత ఎదిగిన కొడుకు చనిపోయి ఆత్మక్షోభ అనుభవిస్తుంటే మీరొచ్చి శవాలమీద రాజకీయాలు చేయొద్దంటూ నవీన్ కుటుంబం సభ్యులు దండం పెట్టి వేడుకున్నారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ చనిపోయిన నవీన్ కుటుంబం బీఆరెస్ పార్టీ కుటుంబమని, అయినా తాను మానవతా దృక్పథంతో పరామర్శ కు వచ్చానని తెలిపారు. నవీన్ నిరుద్యోగం వల్లనే ఆత్మహత్య చేసుకున్నాడని ఆమె ఆరోపించారు.  

Tags:    
Advertisement

Similar News