తెలంగాణ డాక్యుమెంటరీలకు జాతీయ అవార్డులు
పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PRCI) ఈ అవార్డులను ఇచ్చింది. కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో వీటిని విజేతలకు అందించారు.
జాతీయ అవార్డులందుకున్న తెలంగాణ డాక్యుమెంటరీల రూపకర్తలకు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. ఆ డాక్యుమెంటరీలను రూపొందించిన DSN ఫిల్మ్స్ సంస్థకు, రూపకర్త సత్యదూలం కు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు కేటీఆర్. 16వ గ్లోబల్ కమ్యూనికేషన్ కాన్ క్లేవ్ లో 5 టాప్ ఎక్సలెన్స్ అవార్డులు తెలంగాణ డాక్యుమెంటరీలకు రావడం రాష్ట్రానికే గర్వకారణం అని అన్నారు కేటీఆర్.
పబ్లిక్ రిలేషన్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (PRCI) ఈ అవార్డులను ఇచ్చింది. కోల్ కతాలో జరిగిన కార్యక్రమంలో వీటిని విజేతలకు అందించారు. తెలంగాణ రాష్ట్రం తరపున డాక్యుమెంటరీలు రూపొందించిన DSN ఫిల్మ్స్ సంస్థ ప్రతినిధులు వీటిని స్వీకరించారు. DSN ఫిల్మ్స్ సాధిస్తున్న విజయాలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ మద్దతు, ప్రోత్సాహమే కారణమని తెలిపారు సంస్థ సీఈవో, ఎండీ దూలం సత్యనారాయణ. తెలంగాణ బిడ్డగా రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసే పాత్ర పోషిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారాయన. తెలంగాణలో ఉన్న టూరిజం, ఇతర అంశాలు దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించేలా ఈ డాక్యుమెంటరీలు రూపొందించామని చెప్పారు.
ఏయే డాక్యుమెంటరీలకు ఏయే అవార్డులు..
♦ ఆధ్యాత్మిక పర్యాటక చిత్రం (బుద్ధవనం) - క్రిస్టల్ అవార్డు
♦ విజనరీ లీడర్‌షిప్ క్యాంపెయిన్ ఆఫ్ ది ఇయర్ (ప్రగతి శీల తెలంగాణ) - గోల్డ్ అవార్డు
♦ ట్రావెల్, లీజర్, హాస్పిటాలిటీ క్యాంపెయిన్ (తెలంగాణ టూరిజం సోమశిల టూరిజం సర్క్యూట్) - గోల్డ్ అవార్డ్
♦ హెల్త్ కేర్ కమ్యూనికేషన్ ఫిల్మ్ (కొవిడ్-19 అవగాహన) - గోల్డ్ అవార్డ్
♦ ప్రభుత్వ కమ్యూనికేషన్ ఫిల్మ్ (రైతుబంధు, రైతుబీమా) - బ్రాంజ్ అవార్డ్