ఈనెల 20న విచారణకు రండి.. షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు

దీక్ష వ్యవహారంలో అప్పటికప్పుడు ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసినా పోలీసులపై దాడి విషయంలో ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చివరకు చార్జ్ షీట్ దాఖలు చేయడంతో కోర్టు నోటీసులు ఇచ్చింది.

Advertisement
Update:2023-06-05 17:06 IST

వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిలకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఈనెల 20న విచారణకు రావాలని ఆదేశించింది. పోలీసులపై దాడి కేసులో కోర్టు ఈ సమన్లు జారీ చేసింది. దాడి కేసులో పోలీసులు తాజాగా చార్జ్ షీట్ ఫైల్ చేయడంతో కోర్టు విచారణకు రావాలని సమన్లు జారీ చేసింది.

అసలేం జరిగింది..?

ఏప్రిల్ 24న నిరుద్యోగ సమస్యలపై దీక్షకు సిద్ధమైన వైఎస్ షర్మిలను అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె పోలీసులతో వాగ్వాదానికి దిగారు. ఓ దశలో రోడ్డుపైనే బైఠాయించి తనను తరలించాలని చూస్తున్న పోలీసులతో గొడవ పడ్డారు. బందోబస్తు విధుల్లో ఉన్న పోలీసులపైనే ఆమె చేయి చేసుకున్నారు. ఈ వ్యవహారం అప్పట్లో సంచలనంగా మారింది. దీక్ష వ్యవహారంలో అప్పటికప్పుడు ఆమెను పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేసినా పోలీసులపై దాడి విషయంలో ఆమెపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. చివరకు చార్జ్ షీట్ దాఖలు చేయడంతో కోర్టు నోటీసులు ఇచ్చింది.

తెలంగాణలో పార్టీ పెట్టి అధికారం చేజిక్కించుకోవాలనుకున్న షర్మిల ముందుగా నాయకులను టార్గెట్ చేశారు. వారిపై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ హైలెట్ అయ్యారు. కార్యాలయాల ముట్టడి, ధర్నాలు, నిరసనలతో లా అండ్ ఆర్డర్ కి విఘాతం కలిగిస్తూ హల్ చల్ చేశారు. ఈ క్రమంలో ఆమె పోలీసులపై కూడా చేయి చేసుకోవడం మరింత సంచలనంగా మారింది. అదే రోజు ఆమె తల్లి వైఎస్ విజయమ్మ కూడా పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం విశేషం. షర్మిల విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి చార్జ్ షీట్ ఫైల్ చేశారు. 

Tags:    
Advertisement

Similar News