నా తండ్రి తెలంగాణాకే హీరో
కేసీఆర్ కు బర్త్ డే విషెస్ చెప్పిన కేటీఆర్
Advertisement
ప్రతి తండ్రి తమ పిల్లల హీరో అని అంటారు.. కానీ తన తండ్రి తన ఒక్కడికే కాదు.. తెలంగాణాకే హీరో కావడం తన అదృష్టమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. కేసీఆర్ బర్త్ డే సందర్భంగా కేటీఆర్ విషెస్ చెప్పారు. ''కల కనడం.. దాని కోసం హద్దులేని నిబద్ధతతో బయలుదేరారు. విమర్శకులను ఎదుర్కోవడం, అది ఎలా నెరవేరుతుందో వారికి గర్వంగా చూపించారు. తెలంగాణ అనే కలను ప్రేమించారు. వ్యక్తిగత జీవితం గురించి ఆలోచించకుండా తెలంగాణ సాధించారు. మీరు గర్వంగా మీ కొడుకని పిలుచుకునే వ్యక్తి కావడమే నా లక్ష్యం. మీ వారసత్వానికి అర్హులుగా ఉండటానికి ప్రతీక్షణం కృషి చేస్తా'' అంటూ ఎక్స్‌లో ఎమోషనల్ పోస్ట్ చేశారు కేటీఆర్.
Advertisement