రౌండ్ రౌండ్ కీ ఉత్కంఠ.. టీఆర్ఎస్ దే ఆధిక్యం..

టీఆర్ఎస్ మాత్రం తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 515 ఓట్ల ఆధిక్యంతో విజయంపై ధీమాగా ఉంది.

Advertisement
Update:2022-11-06 09:33 IST


మునుగోడు ఫలితం రౌండ్ రౌండ్ కీ ఉత్కంఠగా మారుతోంది. తొలి రౌండ్ లో టీఆర్ఎస్ కి స్పష్టమైన ఆధిక్యం కనపడితే, రెండో రౌండ్ లో బీజేపీ పైచేయి సాధించింది. దీంతో మునుగోడు ఫలితంపై ఉత్కంఠ పెరిగిపోతోంది. అయితే చివరిగా టీఆర్ఎస్ మాత్రం తన ఆధిపత్యం కొనసాగిస్తోంది. రెండు రౌండ్లు పూర్తయ్యే సరికి టీఆర్ఎస్ 515 ఓట్ల ఆధిక్యంతో విజయంపై ధీమాగా ఉంది.


తొలి రౌండ్ ఫలితం ఇలా..

టీఆర్ఎస్ : 6,096

బీజేపీ : 4,904

కాంగ్రెస్‌ : 1,877

తొలిరౌండ్‌ లో టీఆర్ఎస్ 1,192 ఓట్ల ఆధిక్యం సాధించింది. రెండో రౌండ్ లో బీజేపీ 799 ఓట్ల ఆధిక్యం సాధించింది. రెండు రౌండ్ లు పూర్తయ్యే సరికి ఫైనల్ గా టీఆర్ఎస్ దే ఆధిక్యం. రెండు రౌండ్ల తర్వాత టీఆర్ఎస్ 515 ఓట్ల ఆధిక్యంలో ఉంది.

అభ్యర్థుల పరిస్థితి ఏంటి..?

టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విక్టరీ సింబల్ చూపిస్తూ కౌంటింగ్ కేంద్రం బయటకు వచ్చారు. అదే సమయంలో కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయారు.

Tags:    
Advertisement

Similar News