మునుగోడులో ఘర్ వాసపీ..

ఇటీవలే బీజేపీలో చేరిన చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. తనను బలవంతంగా బీజేపీలో చేర్చుకున్నారని, అక్కడ తాను ఉండలేకపోయానని, తన ప్రయాణం టీఆర్ఎస్ తోనేనని క్లారిటీ ఇచ్చారు.

Advertisement
Update:2022-10-11 09:50 IST

మునుగోడు ఉప ఎన్నిక సందర్భంలో కాంగ్రెస్ నుంచి కేడర్ ని బీజేపీలోకి తీసుకెళ్లలేకపోయిన రాజగోపాల్ రెడ్డి, డబ్బులు ఎరవేసి కొంతమందిని తనవైపు తిప్పుకోవాలని చూశారు. ఈ క్రమంలో అధికార పార్టీ నేతలకు కూడా ఆయన గాలం వేశారు. టీఆర్ఎస్ ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లు బీజేపీలోకి వస్తున్నారంటూ చంకలు గుద్దుకున్నారు, బీజేపీ అధిష్టానం వద్ద తన పలుకుబడి చూపించుకోవాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లాన్ రివర్స్ అవుతోంది. రాజగోపాల్ రెడ్డి మాయలో పడినవారు అక్కడ ఇమడలేకపోతున్నారు. ఇటీవలే బీజేపీలో చేరిన చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, తిరిగి టీఆర్ఎస్ గూటికి చేరుకున్నారు. తనను బలవంతంగా బీజేపీలో చేర్చుకున్నారని, అక్కడ తాను ఉండలేకపోయానని, తన ప్రయాణం టీఆర్ఎస్ తోనేనని క్లారిటీ ఇచ్చారు. దీంతో రాజగోపాల్ రెడ్డి నామినేషన్ రోజే బీజేపీకి షాక్ తగిలినట్టయింది.

గట్టుప్పల్ లో టీఆర్ఎస్ కే మెజార్టీ..

కర్నాటి వెంకటేశం బీజేపీలో చేరడంతో గట్టుప్పల్ లో పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉంది. దీంతో నేరుగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. కేటీఆర్ స్వయంగా తనకు ఫోన్ చేశారని, అభివృద్ధి వైపు ఉండాలని సూచించారని వెంకటేశం కార్యకర్తల సమావేశంలో చెప్పుకొచ్చారు. గట్టుప్పల్ లో టీఆర్ఎస్ కి అత్యంత భారీ మెజార్టీ సాధించి, తమ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని చెప్పారు వెంకటేశం. అపోహలతో టీఆర్ఎస్ కి దూరమైన మరికొంతమంది నేతలు కూడా ఎన్నికల సమయం దగ్గరపడేసరికి అసలు విషయం అర్థమై టీఆర్ఎస్ గూటికి చేరుకుంటున్నారు.

ఇటీవల చెన్నూరు మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు కూడా టీఆర్ఎస్ గూటికి తిరిగి వచ్చేశారు. కాంగ్రెస్ లోకి వెళ్లారు కానీ అక్కడ ఇమడలేకపోయారు, కొన్ని రోజుల వ్యవధిలోనే తిరిగి టీఆర్ఎస్ లో చేరారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో నల్లాల కుటుంబ సభ్యులు, అనుచరులు సొంతగూటికి చేరుకున్నారు.

Tags:    
Advertisement

Similar News