ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన‌ ఎంపీ అవినాష్ రెడ్డి

నిన్న అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ ఈ రోజు అవినాశ్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement
Update:2023-04-17 11:35 IST

వివేకానంద రెడ్డి హత్య కేసులో ఈ రోజు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనుంది. మధ్యాహ్నం 3 గంటలకు ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి హాజరవుతారు. ఈ రోజు ఉదయాన్నే అవినాశ్ రెడ్డి పెద్ద ఎత్తున అనుచరులు వెంటరాగా హైదరాబాద్ బయలు దేరారు.

మరో వైపు నిన్న అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ ఈ రోజు అవినాశ్ రెడ్డిని కూడా అరెస్టు చేస్తుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో అవినాశ్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

చీఫ్ జస్టిస్ బెంచ్‌లో అవినాష్ రెడ్డి లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అది నేటి మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణకు అనుమతించే అవకాశం ఉంది. అంటే... అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరవడానికి అరగంటముందు హైకోర్టులో విచారణ ప్రారంభమవుతుంది. హైకోర్టులో ఉన్న అన్నికేసుల వివరాలు తమ ముందుంచాలని ధర్మాసనం కోరింది. పిటిషన్ విచారణ పెండింగ్‌లో ఉండగా.. భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేసి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచిందని లాయర్ చెబుతున్నారు.

Tags:    
Advertisement

Similar News