బీజేపీ ఫస్ట్ లిస్ట్.. ఎంపీ అర్వింద్ క్లారిటీ..!

బీజేపీ సెంట్రల్ ఆఫీసు నుంచి జారీ చేసినట్లు ప్రచారం అవుతున్న లిస్ట్ ఫేక్‌ అని క్లారిటీ ఇచ్చారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని ట్విట్టర్‌లో తేల్చి చెప్పారు.

Advertisement
Update:2023-09-14 17:12 IST

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బీజేపీ ఫస్ట్ లిస్ట్‌ అంటూ 11 మంది అభ్యర్థులతో కూడిన ఓ జాబితా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బీజేపీ సెంట్రల్ ఆఫీసు నుంచి ఈ లేఖను విడుదల చేసినట్లు ప్రచారం జరిగింది. ఈ లిస్ట్‌లో బీజేపీ కీలక నేతల పేర్లు, వారు పోటీ చేసే స్థానాల వివరాలు ఉన్నాయి.

బీజేపీ స్టేట్‌ చీఫ్‌, కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి అంబర్‌ పేట్, కరీంనగర్ నుంచి బండి సంజయ్‌, ఆర్మూర్ నుంచి ధర్మపురి అర్వింద్‌, హుజురాబాద్ నుంచి ఈటల రాజేందర్‌, దుబ్బాక నుంచి రఘునందన్ రావు పోటీ చేయనున్నారని లిస్ట్‌లో ఉంది. ఇక బోథ్‌లో సోయం బాపురావు బరిలోకి దిగుతారని లిస్ట్ సారాంశం. వీరితో పాటు కాగజ్‌నగర్‌ నుంచి పాల్వాయి హరీష్‌, నిర్మల్ బరిలో మహేశ్వర్ రెడ్డి ఉండబోతున్నారని లిస్ట్‌లో పేర్కొన్నారు.

అయితే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ ఈ అంశంపై స్పందించారు. బీజేపీ సెంట్రల్ ఆఫీసు నుంచి జారీ చేసినట్లు ప్రచారం అవుతున్న లిస్ట్ ఫేక్‌ అని క్లారిటీ ఇచ్చారు. అధిష్ఠానం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదని ట్విట్టర్‌లో తేల్చి చెప్పారు.


Tags:    
Advertisement

Similar News