ఒడిశా ఆర్టీసీతో టీఎస్ఆర్టీసీ ఒప్పందం.. ఇరు రాష్ట్రాల మధ్య బస్సు సర్వీసులు

టీఎస్ఆర్టీసీ 10 బస్సులను, ఒడిశా ఆర్టీసీ 13 బస్సులను నడపనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని బస్టాండులను రెండు సంస్థల బస్సులు వినియోగించుకుంటాయి.

Advertisement
Update:2023-02-23 07:13 IST

తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు అత్యంత మెరుగైన సేవలు అందిస్తూ ఆదరణ పొందుతోంది. రాష్ట్రంలోనే కాకుండా.. పక్క రాష్ట్రాలకు కూడా బస్సులు తిప్పుతోంది. ఇప్పటికే ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటక, మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు టీఎస్ఆర్టీసీ బస్సులు నడుస్తున్నాయి. తాజాగా ఒడిషాకు టీఎస్ఆర్టీసీ బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. గతంలోనే కొన్ని బస్సులు నడిచినా.. తాజాగా 23 సర్వీసులు పరస్పరం ఇరు రాష్ట్రాల్లో నడుపుకోవడానికి టీఎస్ఆర్టీసీ, ఒడిశా ఆర్టీసీ మధ్య ఒప్పందం కుదిరింది.

టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి సమక్షంలో ఎండీ వీసీ సజ్జనార్, ఒడిశా రోడ్డు రవాణా సంస్థ ఎంపీ దిప్తేశ్ కుమార్ పట్నాయక్ బుధవారం బస్ భవన్‌లో ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. ఈ మేరకు టీఎస్ఆర్టీసీ 10 బస్సులను, ఒడిశా ఆర్టీసీ 13 బస్సులను నడపనున్నాయి. ఆయా రాష్ట్రాల్లోని బస్టాండులను రెండు సంస్థల బస్సులు వినియోగించుకుంటాయి.

ఒప్పందం ప్రకారం హైదరాబాద్-జైపూర్ మధ్య 2 బస్సులు, ఖమ్మం-రాయ్‌గఢ్ మధ్య 2, భవానీపట్నం-విజయవాడ (భద్రాచలం డిపో) 2, భద్రాచలం-జైపూర్ 4 బస్సులను టీఎస్ఆర్టీసీ నడపనున్నది. ఇక నవరంగ్‌పూర్-హైదరాబాద్ మధ్య 4 బస్సులు, జైపూర్-హైదరాబాద్ 2, భవానీపట్నం-విజయవాడ 2, రాయ్‌గఢ్-కరీంనగర్ 2, జైపూర్-భద్రాచలం 3 బస్సులను ఒఎస్ఆర్టీసీ తిప్పనున్నది. తెలంగాణ సర్వీసులు 3,378 కిలోమీటర్ల మేర.. ఒఎస్ఆర్టీసీ బస్సులు 2,896 కిలోమీటర్ల మేర తిరగనున్నాయి. ఈ ఒప్పందం కారణంగా ఇరు రాష్ట్రాల మధ్య ప్రయాణించే వారికి మరిన్ని బస్సులు అందుబాటులోకి రానున్నాయి.


Tags:    
Advertisement

Similar News