ఇది మన దేశానికి మరో అంతర్జాతీయ అవమానం -కేటీఆర్
తెలంగాణ మంత్రి కేటీఆర్ మరో సారి బీజేపీ పై పరోక్షంగా విరుచుకపడ్డారు. న్యూయార్క్ టైమ్స్ లో వచ్చిన ఓ ఆర్టికల్ ను షేర్ చేసి ఇది మన దేశానికి మరో అంతర్జాతీయ అవమానం అని కామెంట్ చేశారు.
న్యూయార్క్ టైమ్స్ పత్రిక అచ్చు వేసిన ఓ రిపోర్ట్ ను షేర్ చేసిన తెలంగాణ మంత్రికేటీఆర్ ఇది మన్దేశానికి మరో అంతర్జాతీయ అవమానం అంటూ ట్వీట్ చేశారు. అంతే కాదు ''2022 నాటికి దేశానికి బుల్లెట్ ట్రైన్ లు ఇస్తానని మీరు వాగ్దానం చేశారు. కానీ బుల్డోజర్లు ఇస్తున్నారు'' అని కూడా కామెంట్ చేశారు కేటీఆర్.
కేటీఆర్ ఇలా ట్వీట్ చేయడం వెనక అసలుకారణమేంటి ? న్యూ యార్క్ టమ్స్ పత్రిక ఏ రిపోర్ట్ ను ప్రచురించింది ?
'భారతదేశంలోని ఒక ముస్లిం వ్యతిరేక చిహ్నాన్ని న్యూస్ జెర్సీలో ప్రధాన వీధి గుండా ఊరేగించారు' అనే హెడ్డింగ్ తో న్యూ యార్క్ టైమ్స్ ఓ న్యూస్ ప్రచురించింది. ఆగస్టు 15వ తేదీన భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కొందరు హిందువులు అమెరికా, న్యూ జెర్సీలోని ఎడిసన్, వుడ్‌బ్రిడ్జ్ పట్టణాల్లో బుల్డోజర్లతో ప్రదర్శన చేశారు. ఆ బుల్డోజర్లపై మోడీ, యోగీ ఆదిత్యనాథ్ ఫోటోలు పెట్టారు.
ఒక వైపు భారత్ లోని ఉత్తర ప్రదేశ్ సహా పలు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలు తమకు నచ్చని, తమ రాజకీయ వ్యతిరేకుల, ముఖ్యంగా ముస్లింల ఇళ్ళను బుల్డోజర్లతో కూలగొడుతూ, భయోత్పాతం సృష్టిస్తూ, బుల్డోజర్ అంటేనే ముస్లిం వ్యతిరేకంగా చిహ్నంగా తయారు చేసిన నేపథ్యంలో అమెరికాలో బుల్డోజర్ల ను ఊరేగించడంపై న్యూయార్క్ టైమ్స్ తీవ్రంగా విమర్శించింది. ఆగస్టు 15న అమెరికాలో జరిగిన ఊరేగింపు ముస్లిం వ్యతిరేక ఊరేగింపుగా న్యూయార్క్ టైమ్స్ వ్యాఖ్యానించింది. ఇది స్థానిక మైనార్టీల్లో భయాందోళనలకు కారణమయ్యిందని ఆ పత్రిక పేర్కొంది.
అంతర్జాతీయంగా పేరు గాంచిన న్యూయార్క్ టైమ్స్ పత్రికలో ఇలాంటి వార్త రావడం మన దేశానికి అవమానం జరిగినట్టే అని కేటీఆర్ ట్వీట్ చేశారు. గతంలో మహ్మద్ ప్రవక్తపై నూపుర్ శర్మ వ్యాఖ్యల నేపథ్యంలో అంతర్జాతీయంగా మనం అవమానం పాలయ్యాం. మోడీ క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మళ్ళీ అమెకాలోని కొందరు మతోన్మాదుల చర్యల వల్ల మళ్ళీ అంతార్జాతీయంగా అవమానం పాలయ్యాం అనేది కేటీఆర్ ఉద్దేశంగా కనపడుతోంది.