మోహన్ బాబు కొడుకుల మధ్య గొడవ.. మీడియాలో రచ్చ రచ్చ
ఈ గొడవపై మోహన్ బాబు స్పందించారు, అప్పటికే ఆ వీడియోని మనోజ్ డిలీట్ చేశారు. గొడవ పెద్దది చేయొద్దని కోరారు మోహన్ బాబు.
మోహన్ బాబు పెద్ద కొడుకు విష్ణు, చిన్న కొడుకు మనోజ్ మధ్య గొడవలున్నాయా..? ఆ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారికి మినహా మిగతావాళ్లకు ఆ విషయాలేవీ తెలియవు. కానీ ఈరోజు మంచు మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టింగ్ తో వ్యవహారం రచ్చకెక్కింది. సారథి అనే వ్యక్తి ఇంటికి వచ్చి విష్ణు దౌర్జన్యం చేస్తున్నాడని, కొడుతున్నాడంటూ మంచు మనోజ్ ఓ పోస్ట్ పెట్టారు. ఆ వీడియో వైరల్ గా మారింది. మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ఆ వార్తలు ప్రసారం కావడంతో గొడవ పెద్దదైంది. అయితే వెంటనే ఆ వీడియోను మంచు మనోజ్ డిలీట్ చేశారు. అప్పటికే చాలామంది దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారు, సర్క్యులేట్ చేశారు.
ఈ గొడవపై మోహన్ బాబు స్పందించారు, అప్పటికే ఆ వీడియోని మనోజ్ డిలీట్ చేశారు. గొడవ పెద్దది చేయొద్దని కోరారు మోహన్ బాబు. విష్ణు కూడా తర్వాత మీడియాతో మాట్లాడారు. సారథితో తన గొడవను విష్ణు ఆపలేకపోయాడని, వీడియో తీసి పోస్ట్ చేశారని అన్నారు. ఒక్కొకరు విడివిడిగా మీడియా ఛానెల్స్ తో మాట్లాడుతున్నారు కానీ, అధికారిక ప్రకటన కానీ, వీడియో కానీ ఎవరూ విడుదల చేయలేదు.
ఎందుకీ గొడవ..?
మంచు విష్ణు, మనోజ్ మధ్య అసలు గొడవలు ఎందుకొచ్చాయనే విషయం మాత్రం తెలియడంలేదు. కొన్నిరోజులుగా ఇద్దరూ అంటీముట్టనట్టుగా ఉన్నారనే విషయం మాత్రం తెలుస్తోంది. మనోజ్ పెళ్లి సమయంలో కూడా విష్ణు దూరం దూరంగానే ఉన్నారు. అన్నదమ్ములిద్దరూ కలసి పాల్గొనే కార్యక్రమాల్లో కూడా విడివిడిగానే ఉండటం విశేషం. ఇప్పుడు సారథి అనే వ్యక్తి విషయంలో గొడవలు వచ్చినట్టు చెబుతున్నారు. ఈ వివాదం ఇప్పుడు మీడియాకెక్కడంతో రచ్చ రచ్చగా మారింది.