ఆస్కార్ కు ప్రతిపాదనలు ప‍ంపితే మోడీకి ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చేది -కేటీఆర్

ఈ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ అనే శనులు పట్టాయని వాటిని వదిలించుకోవాలని కేటీఆర్ ప్రజలను కోరారు. ఆ రెండు పార్టీలు ఓట్ల కోసం మళ్ళీ ప్రజల వద్దకు వస్తున్నారని ఈ దేశానికి ఏమీ చేయని, పైగా నాశనం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలి ? మళ్ళీ బీఆరెస్ కే ఓట్లు వేసి కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని కేటీఆర్ కోరారు.

Advertisement
Update:2023-03-15 18:57 IST

మనదేశంలో అందరికన్నా గొప్ప నటుడు ప్రధాని మోడీ అని అస్కార్ కు ప్రతిపాదన‌లు పంపితే ఆయనకు ఉత్తమ నటుడు అవార్డ్ వచ్చేదని తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ, మోడి దేశ‌ సంపదను దోచి ఆయన దోస్తు అదానీ చేతుల్లో పెట్టారని మండిపడ్డారు. ఆయనను దేవుడని తెలంగాణ బీజేపీ నాయకులు అంటున్నారని ఆయన అదానీకి తప్ప ఇంకెవ్వరికీ దేవుడు కాదని అన్నారు.

70 రూపాయలు ఉన్న లీటర్ పెట్రోల్ ధరను 115 రూపాయలు చేశారని, 400 ఉన్న గ్యాస్ సిలండర్ ధరను 1200 కు పెంచారని, నిత్యావసరాల ధరలు ఆకాశన్నంటుతున్నాయని మండిపడ్డ కేటీఆర్ ఇంత చేసిన మోడీ దేవుడెలా అవుతాడని ప్రశ్నించారు.

బీజేపీ సర్కార్ విధానాలకు వ్యతిరేకంగా గొంతెత్తిన ప్రతి ఒక్కరిపై జాతీయ దర్యాప్తు సంస్థలు దాడులు చేస్తూ, కేసులు పెడుతూ భయబ్రాంతులకు గురి చేస్తున్నాయని కేటీఆర్ ఆరోపించారు. ఈడీ, ఐటీ, సీబీఐ లకు తాము భయపడేది లేదని న్యాయం కోసం తాము చివరివరకు పోరాడుతామని ఆయన స్పష్టం చేశారు.

ఈ రాష్ట్రానికి బీజేపీ, కాంగ్రెస్ అనే శనులు పట్టాయని వాటిని వదిలించుకోవాలని కేటీఆర్ ప్రజలను కోరారు. ఆ రెండు పార్టీలు ఓట్ల కోసం మళ్ళీ ప్రజల వద్దకు వస్తున్నారని ఈ దేశానికి ఏమీ చేయని, పైగా నాశనం చేసిన వారికి ఓట్లు ఎందుకు వేయాలి ? మళ్ళీ బీఆరెస్ కే ఓట్లు వేసి కేసీఆర్ ను మూడో సారి ముఖ్యమంత్రిని చేయాలని కేటీఆర్ కోరారు.

Tags:    
Advertisement

Similar News