రూపాయి పతనం పై భక్తుల వాదనను మోదీ అంగీకరించరు: కేటీఆర్ వ్యంగ్యం
రూపాయి విలువ పతనం పై భక్తుల వాదనను ప్రధాని మోడీ ఒప్పుకోరని కేటీఆర్ అన్నారు. అందుకు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నింటినీ ట్విట్టర్ లో షేర్ చేశారు.
రూపాయి విలువ దారుణంగా పతనం అవడం పట్ల తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా వరస ట్వీట్లు పోస్టు చేస్తున్నారు. ఉదయం నిర్మలా సీతారామన్ పై వ్యంగ్యంగా స్పంధించిన కేటీఆర్ ఇప్పుడు మోడిపై ట్వీట్లు చేశారు.
రూపాయి విలువ పతనం పై భక్తుల వాదనను ప్రధాని మోడీ ఒప్పుకోరని కేటీఆర్ అన్నారు. అందుకు మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలన్నింటినీ షేర్ చేశారు.
''ప్రపంచ మార్కెట్లు, ఫెడ్ రేట్లు రూపాయిని ఎలా ప్రభావితం చేస్తున్నాయో దేశ ప్రజలకు జ్ఞానాన్ని పంచుతున్న భక్తులందరూ వినాల్సిన విషయం ఇది.
విశ్వగురు మోడీ జీ మీ తర్కంతో ఏకీభవించరు; మోడీ గొంతు నుంచి వెలువడిన కొన్ని అద్భుతమైన జ్ఞాన గుళికల్లోని కొన్నింటిని మీకు చూపిస్తాను
కేంద్ర ప్రభుత్వం అవినీతి కారణంగా రూపాయి బలహీన పడుతోంది
రూపాయి ఐసీయూలో ఉంది వంటి మోడీ ఆణిముత్యాలను మీరు తప్పకుండా వినాల్సిందే'' అని కామెంట్ చేసిన కేటీఆర్ 2013 లో రూపాయి పతనం గురించి మోడీ మాట్లాడిన మాటలను పోస్ట్ చేశారు.
మోడీ మాట్లాడిన మాటలు.
కాంగ్రెస్ కు రూపాయికి మధ్య పోటీ జరుగుతోంది. ఇందులో ఎవరు ఎక్కువ కిందికి దిగజారుతారనేదే అసలు ప్రశ్న: Jun 23, 2013
మనకు స్వాతంత్య్ర వచ్చినప్పుడు, 1 డాలర్ కు 1 రూపాయి సమానం. ఈరోజు చూడండి...రూపాయి ఎంత దారుణంగా పడిపోతుందో: Jul 14,2013
అటల్ జీ కాలంలో రూపాయి స్థానం ఏమిటి ? ఆర్థికవేత్త అయిన ప్రధానమంత్రి హయాంలో ఏమి జరిగుతోంది? అప్పుడు ధరలు ఎక్కడ ఉన్నాయి ? ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? ఎన్ని రోడ్లు నిర్మించారు?
పీఎం జీ, మీరు నరసింహారావు జీని ప్రస్తావించారు కానీ రూపాయి పతనమవుతున్న తీరుకు ఎవరు బాధ్యులు: Aug 15, 2013
ఇప్పుడు రూపాయి ఐసియులో ఉంది కాబట్టి మేము దానికోసం డబ్బును సేకరించాలని అనుకుంటున్నాము: Sep 5, 2013
కాంగ్రెస్‌కి ఇప్పుడు ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రభుత్వాన్ని కాపాడుకోవాలా లేక పడిపోతున్న రూపాయిని కాపాడాలా అనేదే: Sep 10, 2013
డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనమవుతోంది. కాంగ్రెస్ కారణంగా రూపాయి ICUలో ఉంది : Nov 14, 2012
పరిస్థితి ఎలా ఉన్నా, అటల్ జీ రూపాయి విలువను పతనం కానివ్వలేదు. ఆర్థిక వ్యవస్థ బలంగా ఉండేది. అయితే ఆర్థికవేత్త అయిన ప్రధాని హయాంలో ఈరోజు ఏం జరుగుతుందో చూడండి: Nov.25, 2013