ఈ నెల15న వందేభారత్ రైలును వర్చువల్ గా ప్రారంభించనున్న మోడీ
ఈ నెల 15 వ తేదీన సికిందరాబాద్ నుంచి బయలు దేరనున్న వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
సికిందరాబాద్ స్టేషన్ నుంచి విజయవాడకు వెళ్ళే వందేభారత్ రైలును సికిందరాబాద్ లో ఈ నెల 9న ప్రధాని మోడీ ప్రారంభించాల్సి ఉండింది. అయితే ఆయనకున్న బిజీ షెడ్యూల్ కారణంగా ఆ కార్యక్రమం వాయిదా పడింది.
ఇప్పుడు ఆ కార్యక్రమాన్ని ప్రధాని నాలుగు రోజుల ముందుగానే నిర్వహించనున్నారు. ఈ నెల 15 వ తేదీన సికిందరాబాద్ నుంచి బయలు దేరనున్న వందేభారత్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ఫ్లాగ్ ఆఫ్ చేస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాగా ఈ రైలును ట్రయల్ రన్ కోసం నిన్న చెన్నై నుంచి విశాఖపట్నం తీసుకవచ్చారు. కాగా నిన్న కొందరు గుర్తు తెలియని దుండగులు ఆ రైలుపై రాళ్ళతో దాడి చేయగా రెండు బోగీల అద్దాలు పగిలిపోయాయి.
ఈ వందేభారత్ రైలు ప్రస్తుతం సికిందరాబాద్ విజయవాడ మధ్య నడిచినప్పటికీ దాన్ని త్వరలోనే వైజాగ్ దాకా పొడిగిస్తారు.