ఫస్ట్ లిస్ట్ పై కవిత ట్వీట్.. ఆమె పేరు ఎందుకు లేదంటే..?

జగిత్యాల నియోజకవర్గంనుంచి కవిత పోటీ చేస్తారనే అంచనాలున్నాయి. అయితే అనూహ్యంగా లిస్ట్ లో ఆమె పేరు లేదు. అంటే కవిత విషయంలో కేసీఆర్ వ్యూహం వేరే ఉంది.

Advertisement
Update:2023-08-21 17:34 IST

'దందార్ లీడర్ - ధమాకే దార్ డెసిషన్' అంటూ బీఆర్ఎస్ తొలి జాబితాపై ట్విట్టర్లో స్పందించారు ఎమ్మెల్సీ కవిత. 119 స్థానాలకు గాను 115 చోట్ల గెలుపు గుర్రాలను సీఎం కేసీఆర్ ప్రకటించారని తెలిపారు. సీఎం కేసీఆర్ ధైర్యవంతమైన నాయకత్వంపై, బీఆర్ఎస్ పరిపాలనపై ప్రజలు అంతులేని విశ్వాసాన్ని ప్రదర్శిస్తారన్న నమ్మకం తనకుందన్నారు కవిత. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం కోరుతున్నట్టు ట్వీట్ చేశారు.


కవిత విషయంలో కేసీఆర్ వ్యూహం ఏంటి..?

కవిత ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఆమె నిజామాబాద్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆమెను ఎమ్మెల్సీని చేసిన సీఎం కేసీఆర్.. ఈ దఫా అసెంబ్లీలో చోటిస్తారని ఆశించారంతా. జగిత్యాల నియోజకవర్గంనుంచి కవిత పోటీ చేస్తారనే అంచనాలున్నాయి. అయితే అనూహ్యంగా లిస్ట్ లో ఆమె పేరు లేదు. అంటే కవిత విషయంలో కేసీఆర్ వ్యూహం వేరే ఉంది.

లోక్ సభకు కవిత..?

కవిత అసెంబ్లీ బరిలో దిగలేదంటే.. కచ్చితంగా ఆమె లోక్ సభకు పోటీ చేస్తారనే అంచనాలు ఊపందుకున్నాయి. గతంలో కూడా ఆమె ఎంపీగా పనిచేశారు. ఢిల్లీలో బీఆర్ఎస్ తరపున చక్రం తిప్పగలరనే నమ్మకంతో ఆమెను అసెంబ్లీ బరిలో దింపలేదని అంటున్నారు పార్టీ నేతలు. 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ నుంచే పోటీ చేస్తారని తెలుస్తోంది. 

Tags:    
Advertisement

Similar News