గంగపుత్ర సంఘం నాయకులతో ఎమ్మెల్సీ కవిత భేటీ
బీసీల సమస్యలను మండలిలో లేవనెత్తాలని విజ్ఞప్తి
Advertisement
గంగపుత్ర సంఘం నాయకులు, కుల పెద్దలతో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం సమావేశమయ్యారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, నాయకుడు ముఠా జైసింహా ఆధ్వర్యంలో సంఘం నాయకులు కవితను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కవితకు చేపలు, వలలు బహూకరించారు. తెలంగాణ జాగృతి తరపున స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపునకు నివేదిక అందజేసినందుకు కవితకు ధన్యవాదాలు తెలియజేశారు. గంగపుత్రులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను కవిత దృష్టికి తీసుకెళ్లారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయా అంశాలను లేవనెత్తాలని కోరారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లోని అనేక హామీలను అమలు చేయకుండా బీసీలను మోసం చేస్తోందని, వాటిని శాసన మండలిలో లేవనెత్తాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement