భారీ వర్షంలోనూ జాబ్ మేళా సక్సెస్ -కవిత

గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నిజామాబాద్ లో ఐటీ హబ్‌ ను ఏర్పాటు చేశామని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఐటీ హబ్‌ ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా ఉపయోగపడుతుందని వివరించారు.

Advertisement
Update:2023-07-21 13:27 IST

భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా జాబ్ మేళాకు తరలి వచ్చిన యువత, ఉపాధి అవకాశాలపై తమకున్న ఆసక్తిని, పట్టుదలని చూపించారని అన్నారు ఎమ్మెల్సీ కవిత. వారిని అభినందించారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ఆధ్వర్యంలో నిజామాబాద్‌ లో నిర్వహించిన మెగా జాబ్‌ మేళాను ఆమె ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన ఐటీ హబ్‌ లో ఉద్యోగాల భర్తీ కోసం నిర్వహించిన జాబ్‌ మేళాను యువత సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందని అన్నారామె. నిజామాబాద్‌ జిల్లాలో ఐటీ హబ్‌ ఏర్పాటు గొప్ప విషయమని అన్నారు కవిత.


అరూప టెక్నాలజీస్‌, భారత్‌ క్లౌడ్‌, బ్రియో టెక్నాలజీస్‌, చిత్రపురి ఫిల్మ్‌ ఫెస్టివల్‌, క్రిటికల్‌ రివర్‌ టెక్నాలజీస్‌, డిజిటల్‌ ఎమ్‌ఎల్‌ సొల్యూషన్స్‌, డీఎస్‌ టెక్నాలజీస్‌, హెచ్‌ఆర్‌హెచ్‌ నెక్ట్స్‌, ఐటీ అమెరికా.. తదితర సంస్థలు ఈ జాబ్ మేళాలో పాల్గొని యువతకు ఇంటర్వ్యూలు నిర్వహించాయి. పలు విదేశీ కంపెనీలు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొన్నాయి.

గ్రామీణ స్థాయిలో ఐటీ ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా నిజామాబాద్ లో ఐటీ హబ్‌ ను ఏర్పాటు చేశామని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. ఐటీ హబ్‌ ఉద్యోగాలు సృష్టించేందుకు కూడా ఉపయోగపడుతుందని వివరించారు. యువత తమ నైపుణ్యాలతో ఐటీ హబ్‌ స్పేస్‌ ను వాడుకోవాలని పిలుపునిచ్చారు. నిజామాబాద్‌ లో సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధికి ఐటీ హబ్‌ కేంద్ర బిందువు అవుతుందన్నారు. త్వరలో రెండో దశ ఐటీ హబ్‌ కూడా ప్రారంభిస్తామని చెప్పారు కవిత. ఇండస్ట్రియల్‌ పార్క్, ఆటో పార్క్‌ అభివృద్ధికి కృషి చేస్తున్నామని చెప్పారు. ఉద్యోగాలు, అభివృద్ధి, కొత్త అవకాశాలతో మాత్రమే దేశం ముందుకెళ్తుందని చెప్పారు ఎమ్మెల్సీ కవిత. 

Tags:    
Advertisement

Similar News