బీఆర్ఎస్ అంటే ఆత్మీయత.. కాంగ్రెస్ అంటే అహంకారం

రైతులకు రైతుబంధు ఇస్తుంటే బిచ్చం వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు కవిత. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్తు ఎందుకు 3 గంటల చాలు అని చులకనగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆ అహంకారానికి ప్రజలు బదులు చెప్పాలన్నారు.

Advertisement
Update:2023-11-09 08:12 IST

బీఆర్ఎస్ పార్టీ అంటే ఆత్మీయత అని, కాంగ్రెస్ పార్టీ అంటే అహంకారమని అన్నారు ఎమ్మెల్సీ కవిత. ఈ ఎన్నికలు అహంకారానికి, ఆత్మీయతకు మధ్య జరుగుతున్నాయని చెప్పారు. ప్రజలకు ఎవరు కావాలో ఆలోచన చేయాలన్నారు. బోధన్ నియోజకవర్గం గౌడ ఆత్మీయ సమ్మేళన సభలో మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.. బీఆర్ఎస్ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే షకీల్‌ ను భారీ మెజార్టీతో మరోసారి గెలిపించాలని పిలుపునిచ్చారు.


అహంకారంతోనే ఆ వ్యాఖ్యలు..

రైతులకు రైతుబంధు ఇస్తుంటే బిచ్చం వేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అంటున్నారని విమర్శించారు కవిత. రైతులకు 24 గంటల నిరంతర విద్యుత్తు ఎందుకు 3 గంటల చాలు అని చులకనగా మాట్లాడుతున్నారని చెప్పారు. ఆ అహంకారానికి ప్రజలు బదులు చెప్పాలన్నారు. విద్యార్థి నాయకులను అడ్డామీది కూలీలని కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారని, ఆయనకు ఎంత అహంకారం ఉంటే ఇన్ని మాటలు మాట్లాడతారని ప్రశ్నించారు.

ఉమ్మడి రాష్ట్రంలో గౌడ కులస్తులను విస్మరించారని, నిర్లక్ష్యం చేశారని, కల్లుని నాటి ఆంధ్రా పాలకులు అవహేళన చేశారని, హైదరాబాద్‌ లో కల్లు దుకాణాలను మూసివేయించారని గుర్తుచేశారు కవిత. గౌడ కులస్తుల మేలు కోరే సీఎం కేసీఆర్.. అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీ మేరకు దుకాణాలను పునరుద్ధరించారని చెప్పారు. రేణుకా ఎల్లమ్మ దేవాలయానికి, ముదిరాజుల పెద్దమ్మ తల్లి దేవాలయానికి కాంగ్రెస్‌ హయాంలో ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత గ్రామ దేవతల ఆలయాలకు రూ.10 లక్షలు ఇవ్వాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని చెప్పారు. కులవృత్తులను గౌరవించుకుంటేనే సమాజం బాగుటుందన్నారు. సర్దార్ సర్వాయి పాపన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తూ గౌడ కులస్తుల ఆత్మ గౌరవాన్ని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడిందన్నారు కవిత. 

Tags:    
Advertisement

Similar News