ఆందోళనలో తమ్ముడు.. అండగా నిలిచిన కవితక్క..!

దిక్కు తోచని స్థితిలో పడిన ఓ మెరిట్ స్టుడెంట్‌కు.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అండగా నిలబడ్డారు. భుజం తట్టి ప్రోత్సహించారు. అమెరికా పంపించి.. అతని ఉన్నత విద్య అభ్యాసానికి తనవంతు తోడ్పాటుగా నిలిచారు.

Advertisement
Update:2023-08-08 16:45 IST

దిక్కులేని వారికి దేవుడే దిక్కంటారు. ఈ సందర్భంలో మాత్రం.. దిక్కు తోచని స్థితిలో పడిన ఓ మెరిట్ స్టుడెంట్‌కు.. బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత అండగా నిలబడ్డారు. భుజం తట్టి ప్రోత్సహించారు. అమెరికా పంపించి.. అతని ఉన్నత విద్య అభ్యాసానికి తనవంతు తోడ్పాటుగా నిలిచారు.

నిజామాబాద్‌కు చెందిన సామల రితీష్.. బాగా చదువుకున్నాడు. తన ప్రతిభతో అమెరికాలోని నార్త్ వెస్ట్ యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ సీటు సాధించాడు. ఇక అమెరికా వెళ్లి ఉన్నత విద్య చదవడమే తరువాయి అన్న తరుణంలో.. కుటుంబ ఆర్థిక సమస్యలు అతన్ని అయోమయంలోకి నెట్టేశాయి. అతని భవిష్యత్ చదువును ప్రశ్నార్థకం చేశాయి. కుటుంబాన్ని పోషించుకునేందుకు అవసరమైన ఖర్చులకు మించి ఆదాయం లేదని ఉద్యోగం చేసే రితీష్ తండ్రి.. తన కుమారుడిని ఎలా అమెరికాకు పంపించాలా అన్న ఆందోళనకు సైతం గురవ్వాల్సి వచ్చింది.

ఈ సమస్య.. ఎమ్మెల్సీ కవిత చెవిన పడింది. మానవత్వంతో వెంటనే స్పందించిన ఆమె.. రితీష్‌కు అండగా నిలిచారు. తమ్ముడికి అక్కగా భుజం తట్టారు. అతని అమెరికా ప్రయాణ ఖర్చులను తానే భరించారు. తన సొంత ఖర్చులతో టికెట్లు సమకూర్చారు. తగిన సమయంలో.. తగిన రీతిలో తమ కుటుంబాన్ని ఆదుకున్నారంటూ కవితకు రితీష్ కుటుంబీకులు కృతజ్ఞతలు తెలిపారు.

గతంలో కూడా.. నిరుపేద యువతీ యువకులకు కవిత అండగా నిలిచిందంటూ ఆమె అనుచరులు తెలియజేశారు. రితీష్ విషయంలో చూపిన దాతృత్వానికి అందరూ కవితను అభినందిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News