గురుకుల విద్యార్థి శైలజ కుటుంబానికి ఎమ్మెల్సీ కవిత పరామర్శ

ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌

Advertisement
Update:2025-01-06 18:03 IST

వాంకిడి ఆశ్రమ గురుకుల పాఠశాలలో ఫుడ్‌ పాయిజన్‌ తో 21 రోజుల పాటు నిమ్స్‌ లో చికిత్స పొంది మృతి చెందిన విద్యార్థి శైలజ కుటుంబాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పరామర్శించారు. సోమవారం వాంకిడి మండలం డాబా గ్రామంలోని శైలజ నివాసానికి ఎమ్మెల్యేలు కోవ లక్ష్మీ, అనిల్‌ జాదవ్‌ తో కలిసి కవిత వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా మృతురాలి తల్లికి రూ.2 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే శైలజ చనిపోయిందని, ఆమె కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అంతకుముందు వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలను సందర్శించి అక్కడి నుంచి శైలజ కుటుంబానికి వెళ్లడానికి బీఆర్‌ఎస్‌ నేతలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. కవిత కాన్వాయ్‌ ను ఆ రోడ్డు గుండా అనుమతించలేదు. బారికేడ్లు పెట్టి కార్లను అడ్డుకొని మరో రోడ్డు గుండా డాబా గ్రామానికి వెళ్లాలని పట్టుబట్టారు. దీంతో పోలీసులకు, ఎమ్మెల్చేలు కోవ లక్ష్మీ, అనిల్‌ జాదవ్‌ కు మధ్య వాగ్వాదం జరిగింది.




 

ప్రజల పక్షాన గొంతెత్తితే అక్రమ కేసులు పెడుతున్నరు

రాష్ట్ర ప్రజల పక్షాన గొంతెత్తే వారిపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెడుతోందని కవిత అన్నారు. ఇంద్రవెల్లిలోని అమరవీరుల స్తూపం వద్ద ఆమె సోమవారం నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలను, తప్పులను కేటీఆర్‌ బయట పెడుతున్నాడనే ఏసీబీ కేసులతో కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ఎలాంటి కేసులు పెట్టినా తాము భయపడేది లేదన్నారు. ప్రజల పక్షాన పోరుడుతూనే ఉంటామన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి ఏటా రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చి.. ఇప్పుడు రూ.12 వేలే ఇస్తామంటున్నారని ఆగ్రహం చేశారు. ప్రభుత్వం రైతులను మోసం చేసినందుకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్రవ్యాప్తంగా బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు నిరసన కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. అక్రమ కేసులను బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలను కట్టడి చేయాలని చూస్తోన్న రేవంత్‌ రెడ్డి ప్రభుత్వానికి ప్రజాకోర్టులో శిక్ష తప్పదని హెచ్చరించారు.




 


Tags:    
Advertisement

Similar News