మహిపాల్ రెడ్డి కుటుంబానికి కవిత పరామర్శ

విష్ణువర్దన్ రెడ్డి చిత్రపటం ముందు పుష్పాలు ఉంచి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు ఎమ్మెల్సీ కవిత. చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు.

Advertisement
Update:2023-07-30 20:04 IST

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఆమె ఓదార్చారు. మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్దన్ రెడ్డి అకాల మరణం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారామె. రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న విష్ణువర్దన్ రెడ్డి మరణం అత్యంత బాధాకరం అన్నారు కవిత.

పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తనయుడు విష్ణువర్దన్ రెడ్డి కొద్దిరోజుల క్రితం గుండె సంబంధిత సమస్యతో ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్యం పూర్తిగా క్షీణించడంతో ఈనెల 27న విష్ణువర్దన్ రెడ్డి మరణించారు. పుత్రశోకంతో మహిపాల్ రెడ్డి తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మహిపాల్ రెడ్డికి సంతాప సందేశం పంపించారు సీఎం కేసీఆర్. పలువురు బీఆర్ఎస్ నేతలు విష్ణువర్దన్ రెడ్డి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కర్మ కార్యక్రమాల అనంతరం ఈరోజు ఎమ్మెల్సీ కవిత.. మహిపాల్ రెడ్డి కుటుంబాన్ని స్వయంగా వచ్చి పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.

విష్ణువర్దన్ రెడ్డి చిత్రపటం ముందు పుష్పాలు ఉంచి ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించారు ఎమ్మెల్సీ కవిత. చిన్న వయసులోనే తండ్రికి తగ్గ తనయుడిగా రాజకీయాల్లో ఎదుగుతున్న విష్ణువర్ధన్ రెడ్డి అకాల మరణం అత్యంత బాధాకరమని అన్నారు. 

Tags:    
Advertisement

Similar News