బీసీ అధ్యక్షుడిని తొలగించి.. బీసీని సీఎం చేస్తారా..?
కులగణనను ఒక అంటరాని అంశంగా బీజేపీ భావిస్తోందని విమర్శించారు కవిత. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుసుకొని అన్ని వర్గాలకు అవసరమైన పనులను చేస్తున్నారని చెప్పారు.
తెలంగాణలో బీజేపీకి బీసీ నాయకుడు అధ్యక్షుడిగా ఉండగా ఆయన్ను తొలగించారని.. కొత్తగా బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని అంటున్నారని.. ఇదెక్కడి లాజిక్ అని ప్రశ్నించారు ఎమ్మెల్సీ కవిత. ఉన్న పదవిని ఊడగొట్టి ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదని తెలిసి మరీ లేని పదవిని ఇస్తామని చెబుతున్నారంటే బీసీలను రాజకీయంగా మభ్యపెట్టడం కాక ఇంకేంటని అన్నారు. గత ఎన్నికల్లో బీజేపీ 105 స్థానాల్లో డిపాజిట్లు కోల్పోయిందని, ఈసారి అన్నిచోట్లా డిపాజిట్లు కోల్పోయే పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. "బీసీ ముఖ్యమంత్రి ఎక్కడి నుంచి చేస్తారు? బీసీ సీఎం నినాదం కేవలం ఒక రాజకీయ నినాదం, శుష్క నినాదం, శూన్య నినాదం.." అంటూ మండిపడ్డారు కవిత.
కులగణనను ఒక అంటరాని అంశంగా బీజేపీ భావిస్తోందని విమర్శించారు కవిత. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీఎం కేసీఆర్ సమగ్ర కుటుంబ సర్వే చేపట్టి రాష్ట్ర ప్రజల స్థితిగతులు తెలుసుకొని అన్ని వర్గాలకు అవసరమైన పనులను చేస్తున్నారని చెప్పారు. బీసీ కులగణన ఎందుకు చేపట్టలేకపోతోందో బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఓబీసీ రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ఎందుకు ప్రవేశపెట్టలేదని ప్రశ్నించారు. జాతీయ బీసీ కమిషన్ ను నిర్వీర్యం చేయడం సరికాదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల వల్ల బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు.
కాంగ్రెస్ కూడా..
జనగణన చేయకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుకుందని విమర్శించారు కవిత. కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయని పార్టీ కాంగ్రెస్ అని తెలిపారు. అలాంటి పార్టీ వచ్చి బీసీ డిక్లరేషన్ చేస్తే.. చేసిన పాపాలు తొలగిపోవని అన్నారు. తెలంగాణ బీసీలు చైతన్యం కలిగిన వారు కాబట్టి కచ్చితంగా సీఎం కేసీఆర్ కే అండగా నిలబడతారని తేల్చి చెప్పారు కవిత. ఎన్నికలు ఉన్నాయి కాబట్టే బీసీలపై ఇతర పార్టీలకు ప్రేమ వచ్చిందని, ఎన్నికలు లేనప్పుడు బీసీలపై ప్రేమ చూపించింది ఎవరనేది తెలంగాణ ప్రజలు ఆలోచిస్తారని చెప్పారు కవిత. కేసీఆర్ నాయక త్వంలోని బీఆర్ఎస్ పార్టీ బీసీలకు చేసినన్ని మంచి పనులు ఇతర ఏ పార్టీ చేయలేదని అన్నారు.