ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి... హైకోర్టు గ్రీన్ సిగ్నల్ -సుప్రీంకు వెళ్ళనున్న రాష్ట్ర ప్రభుత్వం

డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు ఈ తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు న్యా యవాది దుశ్యంత్‌ దవే కోరగా కోర్టు అందుకు నిరాకరించింది.

Advertisement
Update:2023-02-06 11:54 IST

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బీఆరెస్ ఎమ్మెల్యేల కొనుగోలుకు కుట్ర కేసు సీబీఐకి అప్పగించాలన్న సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ సమర్థించింది. కేసుపై హైకోర్టు సీబీఐ విచారణకుగ్రీన్ సిగ్న ల్ ఇచ్చింది.

ఈ కేసు విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే సిట్ తో కాకుండా ఈ కేసును సీబీఐ తో విచారణ జరిపించాలంటూ బీజేపీనేతలు, కేసులోని నిందితులు కోర్టును ఆశ్రయించడంతో కేసును సీబీఐ కి అప్పగిస్తూ గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం, ఎమెల్యే రోహిత్ రెడ్డి లు హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు సింగిల్ బెంచ్ తీర్పులో తాము జోక్యం చేసుకోబోమంటూ వీరి పిటిషన్ ను కొట్టి వేసింది.

కాగా డివిజన్ బెంచ్ తీర్పుపై సుప్రీం కోర్టుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటి వరకు ఈ తీర్పుపై స్టే విధించాలని ప్రభుత్వం తరఫున సుప్రీం కోర్టు న్యా యవాది దుశ్యంత్‌ దవే కోరగా కోర్టు అందుకు నిరాకరించింది.

Tags:    
Advertisement

Similar News