నాకు చెప్పకుండా ఎలా కూల్చేస్తరు

అధికారులపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ ఆగ్రహం

Advertisement
Update:2025-01-22 16:52 IST

ఎమ్మెల్యేకు చెప్పకుండా తన నియోజకవర్గంలో ఎలా కూల్చివేతలు చేపడుతారని దానం నాగేందర్‌ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఖైరతాబాద్‌ నియోజకవర్గంలోని చింతల్‌బస్తీలో షాదన్‌ కాలేజీ ఎదురుగా ఉన్న ఫుట్‌పాత్‌ పై ఆక్రమణలను జీహెచ్‌ఎంసీ, పోలీసు అధికారులు బుధవారం కూల్చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కూల్చివేతలను ఆపివేయాలని డిమాండ్‌ చేశారు. పొట్టకూటి కోసం ఫుట్‌ పాత్‌ పై చిన్నపాటి పనులు చేసుకుంటూ బతుకుతున్న వారిపై దౌర్జన్యం చేయడం ఏమిటని నిలదీశారు. సీఎం రాష్ట్రంలో లేరని.. ఆయన దావోస్‌ నుంచి వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని కోరారు. కూల్చివేతలు ఆపకుండా తాను అక్కడి నుంచి వెళ్లేది లేదని తేల్చిచెప్పారు. ఎమ్మెల్యే ఆందోళనతో అధికారులు కాస్త వెనక్కితగ్గారు.

Tags:    
Advertisement

Similar News