మహబూబ్ నగర్ జిల్లాలో స్వల్ప భూకంపం
రిక్టర్ స్కేల్‌పై 3.0గా తీవ్రత నమోదు
Advertisement
మహబూబ్ నగర్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం భూమి కంపించింది. మధ్యాహ్నం 12.15 గంటలకు భూమిలో ప్రకంపనలు వచ్చాయి. కౌకుంట్ల మండలం దాసరిపల్లి సమీపంలో భూకంప కేంద్రం ఉన్నట్టుగా అధికారులు గుర్తించారు. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 3.0గా నమోదు అయ్యిందని వెల్లడించారు. ఈనెల నాలుగో తేదీన ఉదయం ఉత్తర తెలంగాణలోని అనేక జిల్లాల్లో కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించింది. ములుగు జిల్లాలోని మేడారం కేంద్రంగా 5.3 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయి. మూడు రోజుల వ్యవధిలోనే రాష్ట్రంలో రెండోసారి భూమి కంపించడం వెనుక కారణాలేమిటా అని శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్నారు. తెలంగాణలో భూమి కంపించిన గంట తర్వాత మలేషియాలోని కౌలాంపూర్‌లో భూప్రకంపనలు వచ్చాయి. రిక్టార్ స్కేల్ 4.4గా తీవ్రత నమోదు అయ్యింది.
Advertisement