మందా జగన్నాథం కు మంత్రుల పరామర్శ
తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ లో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ
Advertisement
తీవ్ర అనారోగ్యంతో నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మాజీ ఎంపీ జగన్నాథంను మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే వివేక్ పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆయనకు మంచి చికిత్స అందించాలని డాక్టర్లను ఆదేశించారు. ఆయన త్వరగా కోలుకొని బయటకు రావాలని ఆకాంక్షించారు. మందా జగన్నాథం తీవ్ర అనారోగ్యంతో పది రోజులుగా నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Advertisement