తెలంగాణ ఇరిగేషన్‌ శాఖలో భారీ ప్రక్షాళన.

రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మొత్తం ఇరిగేషన్ శాఖకు సంబంధించి వైట్‌ పేపర్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్.

Advertisement
Update:2024-02-07 23:00 IST

రేవంత్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. నీటి పారుదల‌ శాఖలో భారీ ప్రక్షాళన చేపట్టింది. ఇందులో భాగంగా ఈఎన్సీ మురళీధర్‌ రావును రాజీనామా చేయాలని ఆదేశించింది. ఈఎన్సీ మురళీధర్‌ రావుపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. మరోవైపు రామగుండం ఈఎన్సీ, కాళేశ్వరం ప్రాజెక్టు ఇన్‌ఛార్జి వెంకటేశ్వర రావును సర్వీసు నుంచి తొలగించింది ప్రభుత్వం.

ఇటీవల నిర్వహించిన కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు సమావేశంలో ఈఎన్సీ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మంత్రి ఉత్తమ్‌ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. KRMB సమావేశం తర్వాత మాట్లాడిన మురళీధర్‌రావు KRMBకి ప్రాజెక్టులు అప్పగించినట్లు మీడియాకు చెప్పారు. దీంతో రేవంత్ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. తర్వాత ప్రాజెక్టులను KRMBకి ప్రాజెక్టులను అప్పగించలేదని.. అప్పగించేది లేదని స్పష్టం చేసింది.

ఇక రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు సహా మొత్తం ఇరిగేషన్ శాఖకు సంబంధించి వైట్‌ పేపర్ రిలీజ్ చేయాలని నిర్ణయించింది రేవంత్ సర్కార్. ఇందులో భాగంగానే నీటి పారుదల శాఖలో ప్రక్షాళన చేపట్టినట్లు తెలుస్తోంది.

Tags:    
Advertisement

Similar News