రోడ్లపై చికెన్, మటన్ వేస్తే కఠిన చర్యలు

ప్రజలు కూడా ఇష్టమొచ్చినట్టు రోడ్లపై చికెట్‌, మటన్ వేయవద్దని కోరారు. నాన్‌ వెజ్‌ వేయడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. మటన్, చికెన్ షాపుల దగ్గర ప్రత్యేక డ్రైవ్‌ మొదలుపెడుతున్నట్టు చెప్పారు.

Advertisement
Update:2023-02-23 14:47 IST

హైదరాబాద్‌లో వీధి కుక్కల సమస్య పరిష్కారం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చర్యలకు సిద్ధమైంది. హైదరాబాద్‌లో బాలుడిపై కుక్కల దాడి నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నట్టు మంత్రి తలసాని శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు ప్రజలు, జంతుప్రేమికులు కూడా సహకరించాలని కోరారు.

వీధి కుక్కలను అరికట్టేందుకు ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పడం కూడా సరికాదన్నారు. ప్రస్తుత ఘటన తర్వాత మరింత వేగంగా డ్రైవ్‌ నిర్వహిస్తామన్నారు. కుక్కల కోసం ఐదు సెంటర్లు ఉన్నాయని.. మరో ఐదు సెంటర్ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. వీధుల వెంబడి తిరుగుతున్న కుక్కలకు స్టెరిలైజ్‌ చేసి ఆయా సెంటర్లలో ఉంచుతామన్నారు.

ప్రజలు కూడా ఇష్టమొచ్చినట్టు రోడ్లపై చికెట్‌, మటన్ వేయవద్దని కోరారు. నాన్‌ వెజ్‌ వేయడం వల్ల అనేక ఇబ్బందులు వస్తాయన్నారు. మటన్, చికెన్ షాపుల దగ్గర ప్రత్యేక డ్రైవ్‌ మొదలుపెడుతున్నట్టు చెప్పారు. ఇష్టానుసారం మాంసపు వ్యర్థాలను బయటపడేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చ‌రించారు. హోటల్స్‌కు కూడా ఇది వర్తిస్తుందన్నారు.

కుక్కలు కూడా జీవులేనని.. వాటిని చంపేయాలన్న ఆలోచన ప్రభుత్వానికి లేదన్నారు. మనం సమస్యను బయటకు చెప్పుకుంటామని.. మూగజీవాలు వాటి బాధను బయటకు చెప్పుకోలేవన్నారు. త్వరలోనే పరిస్థితిని చక్కదిద్దుతామని.. మూడు నెలల్లో ఫలితాలు చూపిస్తామన్నారు. కుక్కల బెడద అరికట్టేందుకు ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌పై ఏవైనా అనుమానాలుంటే జంతు ప్రేమికులు ప్రభుత్వాన్ని సంప్రదించి అనుమానాలను నివృత్తి చేసుకోవచ్చన్నారు. అలా కాకుండా రోడ్లపై డ్రైవ్‌ను అడ్డుకుంటామంటే సరికాదని విజ్ఞప్తి చేశారు.

కుక్కలపై డ్రైవ్‌కు వెళ్లిన సిబ్బందిపై ఒకచోట జంతు ప్రేమికులు దాడి చేయడానికి వచ్చారని ఇది సరైన పద్దతి కాదన్నారు. జీహెచ్‌ఎంసీ మేయర్ పెట్‌ లవర్‌ అని.. ఆమె దగ్గరకు పలు కుక్కలు కూడా ఉన్నాయని.. ఆమె మంచి ఉద్దేశంతో కొన్ని సలహాలు ఇస్తే వక్రీకరించి విమర్శలు చేయడం సరికాదన్నారు. వీధి కుక్కల సమస్యను అధిగమించేందుకు ప్రభుత్వం 13 అంశాలపై ప్రత్యేక మార్గదర్శకాలను విడుదల చేసింది.

Tags:    
Advertisement

Similar News