క్రికెట్ : టిక్కట్ల అమ్మకంలో రాష్ట్రం పరువు తీయకండి... HCAపై స్పోర్ట్స్ మినిస్టర్ సీరియస్

ఈ నెల 25న హైదరాబాద్ లో జరగబోయే క్రికెట్ మ్యాచ్ టిక్కట్ల అమ్మకంలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. బ్లాక్ లో టిక్క‌ట్లు అమ్మారని బైట పడితే కఠిన చర్యలు తప్పవని HCAను హెచ్చరించారు.

Advertisement
Update:2022-09-21 20:46 IST

ఈ నెల 25న హైదరాబాద్ లో ఇండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరగనున్న టీ20 క్రికెట్ మ్యాచ్ కు సంబంధించి టిక్కట్ల అమ్మకాలు వివాదాస్పదమయ్యాయి. టిక్కట్లు అన్ని బ్లాక్ లో అమ్ముకుంటున్నారని HCA మీద ఆరోపణలు గుప్పుమన్నాయి. ఆన్ లైన్ లో కానీ, ఆఫ్ లైన్ లో కానీక్రికెట్ ప్రియులకు టిక్కట్లు లభించడం లేదు. ఈ క్రమంలో ఈ రోజు జింఖానా గ్రౌండ్స్ వద్ద వందలాది మంది క్రికెట్ ఫ్యాన్స్ నిరసన తెలిపారు. HCA కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో తెలంగాణ క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు.

మ్యాచ్ టిక్కట్ల అమ్మకాల గురించి ప్రతి విషయాన్ని వెల్లడించాలని శ్రీనివాస్ గౌడ్ HCAను ఆదేశించారు. బ్లాక్ లో టిక్క‌ట్లు అమ్మారని కానీ బైట పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ''ఉప్పల్ స్టేడియంకు తెలంగాణ ప్రభుత్వం భూమి ఇచ్చింది ఎవరో పది మంది ఎంజాయ్ చేయడానికి కాదు. క్రికెట్ అభిమానులందరి కోసం ఆ స్థలం కేటాయించింది'' అని అన్నారు. టిక్కట్ల అమ్మకాల వ్యవహారంలో రాష్ట్ర పరువును తీసేలా వ్యవహరిస్తున్నారని శ్రీనివాస్ గౌడ్ HCA మీద మండి పడ్డారు. 

Tags:    
Advertisement

Similar News