‘మీ టికెట్’ యాప్‌ను ఆవిష్కరించిన మంత్రి శ్రీధర్‌బాబు
‘మీ టికెట్’ యాప్ ను మంత్రి శ్రీధర్‌బాబు ఇవాళ ప్రారంభించారు.
ప్రయాణికులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఆర్టీసీ, మెట్రో, ఆలయాలు, పర్యాటక ప్రాంతాల టికెట్లను సులభంగా పొందేందుకు తయారు చేసిన ‘మీ టికెట్’ యాప్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ఇవాళ ప్రారంభించారు. ఈ ‘మీ టికెట్’ అప్లికేషన్‌ను టీజీఈఎస్‌డీ రూపొందించింది. ఈ యాప్ ద్వారా ప్రజలు ఆర్టీసీ టికెట్లు, మెట్రో రైల్, పలు దర్శన టికెట్లు, పర్యాటక ప్రాంతాల టికెట్లను సులభంగా పొందవచ్చు.
కాగా, ఈ యాప్‌తో పాటు ప్రజలకు సౌలభ్యమైన మరిన్ని యాప్‌లను అందుబాటులోకి తీసుకొస్తామని శ్రీధర్‌బాబు తెలిపారు. ఈ యాప్ లో తెలంగాణలోని 15 ప్రముఖ దేవాలయాలు, 129 పార్కులు, 54 బోటింగ్ ప్రదేశాలు, జూ, మెట్రో, ఆర్టీసీ, మ్యూజియాలు, ప్లే అండ్ ఎంటర్ టైన్ మెంట్ జోన్స్ కు సంబంధించిన టికెట్లను తీసుకోవచ్చని మంత్రి వెల్లడించారు. అంతేకాకుండా ఈ యాప్ ద్వారా జీహెచ్ఎంసీ పరిధిలోని కమ్యూనిటీ హాళ్లు, జిమ్ లు, స్పోర్ట్ కాంప్లెక్స్ లను బుకింగ్ చేసుకోవచ్చు. మీరు ఎంచుకున్న లొకేషన్ కు సమీప ప్రాంతాల్లోని చూడదగిన ప్రదేశాలుంటే.. ఆ సమాచారం కూడా యాప్ లో ఆటోమేటిక్ గా కనిపిస్తుందని మంత్రి తెలిపారు