గిరిజన సంక్షేమం: ప్రేమ కేసీఆర్ ది.. కుట్ర మోదీది

ములుగు జిల్లా జాకారంలో 335 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా కేంద్రం యూనివర్శిటీ మంజూరు చేయలేదన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఒక్క ఎకరం భూమి కేటాయించని ఏపీకి మాత్రం మూడేళ్ల క్రితమే కేంద్రం గిరిజన యూనివర్శిటీ కేటాయించిందని, ఇదెక్కడి పక్షపాత ధోరణి అని ప్రశ్నించారామె.

Advertisement
Update:2023-10-02 19:25 IST

గిరిజనులపై నిజమైన ప్రేమ చూపిస్తోంది సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. సీఎం కేసీఆర్ గిరిజనులకోసం రిజర్వేషన్లను 6 నుంచి 10శాతానికి పెంచారని గుర్తు చేశారు. రిజర్వేషన్ల పెంపుతో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. అయితే తెలంగాణ అసెంబ్లీ పంపించిన తీర్మానాన్ని ఇప్పటి వరకు కేంద్రం ఆమోదించలేదని విమర్శించారు మంత్రి సత్యవతి రాథోడ్.


ట్రైబల్ యూనివర్శిటీ ప్రకటన ఓ కుట్ర..

గిరిజనుల ఓట్ల కోసం నరేంద్ర మోదీ మోసపూరిత వాగ్దానాలు చేస్తున్నారని అన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. గిరిజన యూనివర్శిటీ అనే ప్రకటన ఓ మోసపూరిత కుట్ర అని అన్నారు. 2014 విభజన చట్టం హామీ ప్రకారం గిరిజనులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గిరిజన యూనివర్శిటీ ఏర్పాటు చేయాల్సి ఉందని, కానీ.. పదేళ్లుగా ఆ హామీని మోదీ తొక్కిపట్టారని, గిరిజనులకు, పేద బిడ్డలకు అన్యాయం చేశారని చెప్పారు. 2014 నుండి 2018 వరకు అనేకసార్లు కేంద్ర అధికారుల బృందం వచ్చి ఇక్కడి ప్రాంతాలను పరిశీలించి వెళ్లిందని, కానీ యూనివర్శిటీపై నోరు మెదపలేదని చెప్పారు. ములుగు జిల్లా జాకారంలో 335 ఎకరాల స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయించినా కేంద్రం యూనివర్శిటీ మంజూరు చేయలేదన్నారు మంత్రి సత్యవతి రాథోడ్. ఒక్క ఎకరం భూమి కేటాయించని ఏపీకి మాత్రం మూడేళ్ల క్రితమే కేంద్రం గిరిజన యూనివర్శిటీ కేటాయించిందని, ఇదెక్కడి పక్షపాత ధోరణి అని ప్రశ్నించారామె.

కేంద్రానికి నిజంగా గిరిజనుల పట్ల చిత్తశుద్ధి ఉంటే.. సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా ప్రకటించాలని డిమాండ్ చేశారు మంత్రి సత్యవతి రాథోడ్. మేడరం జాతరకు కేంద్ర ప్రభుత్వం నయా పైసా ఇవ్వట్లేదని చెప్పారు. గిరిజనులపై బీజేపీకి ప్రేమ లేదనడానికి ఇవన్నీ నిదర్శనం అన్నారామె. ఎన్నికల వేళ బీజేపీ చేస్తున్న కుట్రలను ప్రజలు తిప్పికొట్టడం ఖాయమన్నారు. మోదీ జిమ్మిక్కుల్ని గిరిజన యువత గమనిస్తోందని చెప్పారు మంత్రి. 

Tags:    
Advertisement

Similar News