విజయోత్సవాలపై జీహెచ్ఎంసీ ముఖ్య నేతలతో మంత్రి పొన్నం భేటీ

కాంగ్రెస్‌ ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలపై ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు.

Advertisement
Update:2024-12-01 15:19 IST

కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన సందర్భంగా నిర్వహించనున్న ‘ప్రజాపాలన -ప్రజా విజయోత్సవాలపై ఇంచార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ జీహెచ్ఎంసీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రజా పాలన ప్రజా విజయోత్సవాలో భాగంగా హైదారాబాద్ లో జరిగే కార్యక్రమాలను మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. ఏడాది కాలంగా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు , పథకాలను విస్తృత అవగాహన కల్పించాలని సూచించారు. 7,8,9 తేదీల్లో డివిజన్, నియోజకవర్గాలు, రాష్ట్ర స్థాయిలో జరిగే కార్యక్రమాలపై దిశా నిర్దేశం చేశారు.

రైసింగ్ హైదరాబాద్ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో పెద్ద ఎత్తున అభివృద్ది కార్యక్రమాలు, శంఖు స్థాపనలు చేయనుండడంతో ప్రజల్లో వాటిపై విస్తృత అవగాహన కల్పించాలి మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు.ఈ సమావేశంలో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ ఇంచార్జి దీపాదాస్ మున్షి, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి , మేయర్ గద్వాల విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి , రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, శ్రీగణేష్, ఎమ్మెల్సీలు అమీర్ ఉల్లఖాన్ , ప్రభాకర్, డీసీసీ అధ్యక్షులు రొహిన్ రెడ్డి , సమీర్ ఉల్లాఖాన్ , కార్పొరేషన్ చైర్మన్లు శ్రీకాంత్ గౌడ్, మెట్టు సాయి కుమార్ లు, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు హాజరయ్యారు.

Tags:    
Advertisement

Similar News