డిసెంబ‌ర్‌లో స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ ప్రారంభం - కేటీఆర్

ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు నెల‌కొల్పి, వాటిల్లో స్కిల్ డెవ‌లప్‌మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వడం, యువతకు ఉపాధి అవ‌కాశాలు మెరుగుపరచడం తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు కేటీఆర్.

Advertisement
Update:2022-10-08 14:30 IST

దండుమల్కాపురంలోని మైక్రో-స్మాల్-మీడియం ఎంటర్‌ప్రైజెస్ (MSME) పార్క్‌లో ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి వస్తుందని తెలిపారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా తన సంతోషాన్ని వెలిబుచ్చారు. MSME గ్రీన్‌ ఇండస్ట్రియల్ పార్కులో అతి విశాలమైన, అన్ని వసతులు ఉన్న నైపుణ్య శిక్షణా కేంద్రం త్వరలో అందుబాటులోకి వస్తుందని, ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తవుతాయని తెలిపారాయన.

ఇండ‌స్ట్రియ‌ల్ పార్కులు నెల‌కొల్పి, వాటిల్లో స్కిల్ డెవ‌లప్‌మెంట్ సెంట‌ర్స్ ఏర్పాటు చేసి స్థానిక నిరుద్యోగ యువ‌త‌కు నైపుణ్య శిక్ష‌ణ ఇవ్వడం, యువతకు ఉపాధి అవ‌కాశాలు మెరుగుపరచడం తమ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు కేటీఆర్. దండుమల్కాపురంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ నిర్మాణ పనుల ఫొటోలను ఆయన తన ట్వీట్‌లో పొందుపరిచారు. ఈ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ద్వారా యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని భరోసా ఇచ్చారు.

దండుమల్కాపురం ఇండస్ట్రియల్ పార్క్ విశిష్టతలు..

గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ జోన్‌గా ప్రత్యేకత

547 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఇండస్ట్రియల్ పార్క్

589 MSME యూనిట్ల స్థాపనకు వీలు

ప్రత్యక్షంగా 20 వేల మందికి ఉపాధి

పరోక్షంగా 16 వేల మందికి ఉపాధి

ఈ ఇండస్ట్రియల్ పార్క్ లో స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటు ఇప్పుడు తుది దశకు వచ్చింది. ఇండస్ట్రియల్ పార్క్ లో నెలకొల్పే పరిశ్రమలతో పాటు, ఇతర పరిశ్రమల్లో ఉపాధి అవకాశాల కోసం ఇక్కడ యువతకు శిక్షణ ఇస్తారు.

Tags:    
Advertisement

Similar News