కేరళ, కర్నాటక, తెలంగాణ.. భలే పోలిక చెప్పిన కేటీఆర్

కేరళ స్టోరీ కర్నాటకలో ఫెయిలైనట్టే, కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపించలేవని లాజిక్ చెప్పారు మంత్రి కేటీఆర్.

Advertisement
Update:2023-05-13 15:45 IST

కర్నాటక ఎన్నికల ఫలితాలపై తనదైన శైలిలో స్పందించారు తెలంగాణ మంత్రి కేటీఆర్. కర్నాటకలో ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెబుతూనే.. తెలంగాణలో ఆ ఫలితాల ప్రభావం ఉండదని స్పష్టం చేశారు.

కేరళ, కర్నాటక, తెలంగాణ..

ఇటీవల కేరళ స్టోరీ సినిమా గురించి బీజేపీ ఓ రేంజ్ లో ప్రచారం చేసింది. సరిగ్గా కర్నాటక ఎన్నికల సమయంలో బీజేపీ ఈ సినిమాని హైలెట్ చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదానికి మద్దతిస్తుందన్నట్టుగా విమర్శలు చేసింది. అయితే కేరళ స్టోరీ కర్నాటక ప్రజలను రంజింపజేయడంలో ఫెయిలైందని అన్నారు మంత్రి కేటీఆర్. కేరళ స్టోరీ కర్నాటకలో ఫెయిలైనట్టే, కర్నాటక ఎన్నికల ఫలితాలు తెలంగాణపై ప్రభావం చూపించలేవని లాజిక్ చెప్పారు. నీచమైన రాజకీయాలు, విభజన రాజకీయాలను తిరస్కరించినందుకు కర్నాటక ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.


ఇక పోటీ పడదామా..?

ఐటీ రంగంలో హైదరాబాద్, బెంగళూరు మధ్య ఉన్న పోటీ తెలిసిన విషయమే. ఇటీవల కాలంలో బెంగళూరుని తోసిరాజని, ఐటీ ఉత్పత్తుల్లో హైదరాబాద్ అగ్ర స్థానం కైవసం చేసుకుంది. కొత్త కంపెనీలు, ప్రాజెక్ట్ ల విషయంలో హైదరాబాద్ నెంబర్-1 గా ఎదుగుతోంది. కర్నాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటవుతున్న దృష్ట్యా ఇకనైనా అక్కడ పరిస్థితులు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు మంత్రి కేటీఆర్. ఐటీ రంగంలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పనలో.. హైదరాబాద్, బెంగళూరు మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని ఆన ఆకాంక్షించారు. 

Tags:    
Advertisement

Similar News