ఆలోచించుకో రైతన్నా..?

గత కాంగ్రెస్ పాలనకు, ఇప్పటి కేసీఆర్ పాలనకు మధ్య తేడాను బేరీజు వేసుకోవాలని కోరారు. ఎవరి పాలన బాగుందో చూసుకుని ఓటు వేయాలని చెప్పారు కేటీఆర్.

Advertisement
Update:2023-10-27 12:33 IST

తెలంగాణ ఎన్నికల్లో ఆలోచించి ఓటు వేయాలని రైతన్నలకు పిలుపునిచ్చారు మంత్రి కేటీఆర్. ఆలోచించి విజ్ఞతతో ఓటు వేయాలని చెప్పారు. ఏది మనకు కావాలో దాని గురించి ఆలోచన చేయాలని అన్నారు కేటీఆర్. ఈమేరకు ఆయన రైతన్నలకోసం ట్వీట్ వేశారు. తెలంగాణ రైతన్నలు ఆలోచించుకుని ఓటు వేయాలని కోరారు.


కేసీఆర్ ఇచ్చే 24గంటల ఉచిత కరెంటు కావాలా..?

కర్నాటకలో కాంగ్రెస్ ఇస్తున్న 5 గంటల కరెంటు కావాలా..?

రేవంత్ రెడ్డి చెప్పిన 3 గంటల కరెంటు కావాలా..?

ఆలోచించు తెలంగాణ రైతన్నా.. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు. ఆరు దశాబ్దాలపాటు అధికారంలో ఉండి తెలంగాణను ఆగం చేసినవారు మళ్లీ కావాలా అని ప్రశ్నించారు. వారి హయాం అంతా కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ ఫార్మర్లుగా ఉందని.. మళ్లీ అలాంటి రోజులు కావాలా అని ప్రశ్నించారు. కేసీఆర్ హయాంలో.. రైతుబంధు ఇచ్చారని, రైతు బీమా తెచ్చారని, చెరువులు బాగు చేశారని, ప్రాజెక్ట్ లు కట్టి నెర్రెలు బారిన నేలను సస్యశ్యామలం చేశారని గుర్తు చేశారు.

ఆగం కావొద్దు..

సీఎం కేసీఆర్ కూడా తన ప్రజా ఆశీర్వాద సభల్లో ఇదే విషయాలన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. ఒక్క ఛాన్స్ అంటూ కొంతమంది ఆపద మొక్కులు మొక్కుతూ వస్తుంటారని, అలాంటి వారికి అవకాశం ఇస్తే ఆగమైపోతారు జాగ్రత్త అని హితవు పలుకుతున్నారు. కాంగ్రెస్ కి మళ్లీ ఓటు వేస్తే ఆ చీకటి రోజులు ఖాయం అని అంటున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ కూడా ఇదే విషయంలో రైతాంగాన్ని మేల్కొలిపేలా ట్వీట్ వేశారు. గత కాంగ్రెస్ పాలనకు, ఇప్పటి కేసీఆర్ పాలనకు మధ్య తేడాను బేరీజు వేసుకోవాలని కోరారు. ఎవరి పాలన బాగుందో చూసుకుని ఓటు వేయాలని చెప్పారు కేటీఆర్. 

Tags:    
Advertisement

Similar News