ముందుంది మొసళ్ల పండుగ.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో.. అంటూ కేటీఆర్ వేసిన ట్వీట్ కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలకు కరెక్ట్ గా సరిపోతుంది.

Advertisement
Update:2023-10-24 13:14 IST

పేదవాడి కోపం పెదవికి చేటు.. ఇన్నాళ్లూ కడుపుమండిన అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకున్న ఉదాహరణలున్నాయి. ఇప్పుడు కరెంటివ్వలేదన్న కారణంతో, పైర్లు ఎండిపోతున్నాయన్న కడుపుమంటతో రైతులు తిరగబడ్డారు. కర్నాటకలో ఈ పరిస్థితులు కళ్లకు కడుతున్నాయి. కరెంటిస్తారా, ఆఫీస్ లో మొసళ్లను వదలమంటారా అంటూ కొంతమంది రైతులు.. నేరుగా ట్రాక్టర్లలోనే వాటిని సబ్ స్టేషన్లకు తీసుకొచ్చిన వీడియోలు చూస్తున్నాం. ఈ వీడియోలు కొంతమందికి ఆశ్చర్యం కలిగించొచ్చు కానీ.. వాస్తవానికి కర్నాటకలో రైతుల దయనీయ పరిస్థితికి ఇవి అద్దం పడుతున్నాయి. ఈ వీడియోను రీట్వీట్ చేస్తూ మంత్రి కేటీఆర్ ఆసక్తికర క్యాప్షన్ పెట్టారు. ముందుంది మొసళ్ల పండగ అంటే ఇదేనేమో అని అన్నారు కేటీఆర్.


వాస్తవానికి బీజేపీ పాలనతో విసిగి వేసారిపోయిన కర్నాటక రైతులు ఈసారి హంగ్ కి ఛాన్స్ లేకుండా కాంగ్రెస్ కి పట్టం కట్టారు. అధికారంలోకి రావడం కోసం కాంగ్రెస్ కూడా భారీగా హామీలు గుప్పించింది. అయితే వాటి అమలులో మాత్రం తడబడుతోంది. ముఖ్యంగా రైతులకు ఎనిమిది గంటల కరెంటు హామీని నిలబెట్టుకోలేకపోయింది కాంగ్రెస్, అధికారికంగా 5 గంటలు ఇస్తామన్నా.. అదీ సాధ్యం కావడంలేదు. దీంతో కర్నాటక రైతాంగం ఇబ్బంది పడుతోంది. ఒకరకంగా కాంగ్రెస్ మోసపు హామీలను నమ్మి ఓటు వేసినందుకు ఈ మొసళ్ల పండగను వారు ఊహించలేకపోయినట్టే లెక్క.

కాంగ్రెస్ కి కూడా వర్తించినట్టే..!

కర్నాటక రైతాంగాన్ని నట్టేట ముంచుతున్న కాంగ్రెస్ కి కూడా ముందు ముందు మొసళ్ల పండగ కనపడుతుందనే అనుకోవాలి. కరెంటు కష్టాలు ఎదుర్కొంటున్న రైతులు లోక్ సభ ఎన్నికల్లో ఆ పార్టీని నమ్మే ప్రసక్తి ఉండదు. ఇటు ఐదు రాష్ట్రాల ఎన్నికలపై కూడా కర్నాటక హామీల ప్రభావం బలంగా కనపడేలా ఉంది. అక్కడ హామీలు నిలబెట్టుకోలేని కాంగ్రెస్.. ఇక్కడ మేనఫెస్టోపై గొప్పలు చెప్పుకుంటామంటే కుదరదు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలంటున్నారు, కర్నాటకలో ఇచ్చిన గ్యారెంటీలకు దిక్కులేనప్పుడు.. ఇక తెలంగాణలో వాటిని ఎలా ఆచరణలో పెడతారనేది ఆలోచించాల్సిన విషయమే. ముందుంది మొసళ్ల పండుగ అంటే ఇదేనేమో.. అంటూ కేటీఆర్ వేసిన ట్వీట్ కాంగ్రెస్ భవిష్యత్ రాజకీయాలకు కరెక్ట్ గా సరిపోతుంది. 


Tags:    
Advertisement

Similar News