కాంగ్రెస్ నేతలు ఇవాళ సీట్లు.. అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు
ప్రధాని మోడీ పాలమూరు సభలో బీఆర్ఎస్‌ది కుటుంబ పాలన అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తమది వంద శాతం కుటుంబ పాలనే అని.. రైతులే మా కుటుంబసభ్యులని చెప్పారు.
కాంగ్రెస్‌పై మాటల దాడిని కంటిన్యూ చేస్తున్నారు మంత్రి కేటీఆర్. ఇవాళ సూర్యాపేట జిల్లాలో పర్యటించిన మంత్రి కేటీఆర్.. హస్తం పార్టీపై తనదైన శైలిలో సెటైర్లు పేల్చారు. కాంగ్రెస్‌ను నమ్మితే గొర్రెల మందకు తోడేలును కాపలా పెట్టినట్లేనని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు ఇవాళ సీట్లు అమ్ముకుంటున్నారని.. అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేయడం ఖాయమన్నారు కేటీఆర్. కాంగ్రెస్ పార్టీ వారంటీ అయిపోయి వందేళ్లు దాటిందన్నారు. వారంటీ ముగిసిన పార్టీ గ్యారంటీలు ఇస్తుందంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పాలనలో కరెంటు కోసం ఏఈ, డీఈకి ఫోన్లు చేసిన పరిస్థితి ఉండేదన్నారు. కానీ, ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం 24 గంటల కరెంటు ఇస్తుందని గుర్తుచేశారు. కాంగ్రెస్ హయాంలో మూడు గంటలు కరెంటు ఇవ్వలేని పరిస్థితి అంటూ విమర్శించారు కేటీఆర్.
ఇక ప్రధాని మోడీ పాలమూరు సభలో బీఆర్ఎస్‌ది కుటుంబ పాలన అంటూ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. తమది వంద శాతం కుటుంబ పాలనే అని.. రైతులే మా కుటుంబసభ్యులని చెప్పారు. బీఆర్‌ఎస్‌ది గాంధీ వారసత్వమైతే.. బీజేపీది గాడ్సే వారసత్వమంటూ సెటైర్ వేశారు.
సూర్యాపేట జిల్లాలో పర్యటించిన కేటీఆర్.. ఐటీ హబ్‌ను ప్రారంభించారు. తర్వాత జమ్మిగడ్డలో సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను ప్రారంభించారు. మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, మహిళా కమ్యూనిటీ హాల్ భవనాలను ఓపెన్ చేశారు. లబ్ధిదారులకు దళితబంధు చెక్కులు, డబుల్ బెడ్రూం ఇళ్లు అందించారు.