ఆయన ఒక పరమానందయ్య.. ఈ ఎంపీ ఆయనకు శిష్యుడు.. కేటీఆర్ సెటైరికల్ పోస్ట్

బండి సంజయ్ మాటలపై ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ బయటకు వచ్చాయి.

Advertisement
Update:2023-02-03 14:09 IST

బీజేపీ నేతృత్వంలోని కేంద్రం ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌‌‌పై అనేక మంది అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన కేటాయింపుల్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని రాష్ట్రంలోని ప్రజలంతా చర్చించుకుంటున్నారు. అధికార పార్టీ బీఆర్ఎస్ కూడా రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై గళమెత్తింది. కానీ, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మాత్రం బడ్జెట్ అత్యుత్తమంగా ఉందని ప్రశంసలు కురిపించారు. ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో అత్యుత్సాహంతో ఎవేవో మాట్లాడారు. మాటలు తడబటమే కాకుండా.. తనకు తెలియని లెక్కలు కూడా చెప్పేశారు. బండి సంజయ్ మాటలపై ఇప్పటికే సోషల్ మీడియాలో మీమ్స్ బయటకు వచ్చాయి. తాజాగా తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణవర్థన్ రెడ్డి బండి సంజయ్ ఢిల్లీలో మాట్లాడిన మాటలతో కూడిన వీడియోను ట్విట్టర్‌లో షేర్ చేశారు. కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ ప్రజలకు ఒక దండం అంటూ ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు. దానికే ఈయన ఒక యాక్సిడెంటల్ ఎంపీ, ఒక జోకర్ అంటూ ట్యాగ్ చేశారు. వాస్తవానికి ఢిల్లీలో ఎంపీ సంజయ్ మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా నవ్వు రావల్సిందే. ఆ వీడియోతో కూడిన ట్వీట్‌ను మంత్రి కేటీఆర్ రీట్వీట్ చేస్తూ తనదైన శైలిలో సెటైర్లు జోడించారు.

'ఢిల్లీ లో పరమానందయ్య గారు ఫేకుడు, ఆయన గారి శిష్యులు ఇక్కడ జోకుడు.. ఈయన ఒక ఎంపీ, అది కూడా కరీంనగర్ నుండి' అంటూ బండి సంజయ్‌ను ఎద్దేవా చేశారు. బండి సంజయ్ ఎప్పుడు మైకు ముందకు వచ్చినా.. సబ్జెట్ లేకుండా, తడబడుతూ మాట్లాడుతుంటారు. బడ్జెట్‌పైన కూడా ఇలాగే మాట్లాడాలని ప్రయత్నించి మొత్తానికి అందరికీ దొరికిపోయారు. ఇప్పుడు ఆయన మాటలే సోషల్ మీడియాలో వైరల్‌గా మారి అందరికీ నవ్వులు తెప్పిస్తున్నాయి.


Tags:    
Advertisement

Similar News