బాండ్ పేపర్ వీరుడా..! రేవంత్ రెడ్డిపై కేటీఆర్ సెటైర్లు..

గెలుపు చిరునామాగా మార్చుకున్న మహానాయకుడు కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరం అని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడితే రాజకీయ సన్యాసం అని శపథం చేసి మరీ, ఓడిపోయిన తర్వాత నిస్సిగ్గుగా తర్వాతి ఎన్నికల్లో ఎంపీగా రేవంత్ పోటీ చేశారని గుర్తు చేశారు మంత్రి కేటీఆర్.

Advertisement
Update:2023-08-21 22:04 IST

సీఎం కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో రెండు స్థానాల్లో పోటీకి దిగుతానని ప్రకటించిన నేపథ్యంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్పందన తెలిసిందే. ఓటమి భయంతోనే ఆయన రెండు స్థానాల్లో పోటీ చేస్తున్నారంటూ వెటకారం చేశారు రేవంత్. ఆయన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్లిచ్చారు మంత్రి కేటీఆర్. కొడంగల్ లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యల్ని గుర్తు చేశారు.


40 ఏళ్లుగా కేసీఆర్ ఎక్కడ, ఎప్పుడు పోటీ చేసినా గెలుపే ఆయన చిరునామా అని చెప్పారు మంత్రి కేటీఆర్. గెలుపు చిరునామాగా మార్చుకున్న మహానాయకుడు కేసీఆర్ గురించి రేవంత్ రెడ్డి మాట్లాడటం విడ్డూరం అని అన్నారు. ఎమ్మెల్యేగా ఓడితే రాజకీయ సన్యాసం అని శపథం చేసి మరీ, ఓడిపోయిన తర్వాత నిస్సిగ్గుగా తర్వాతి ఎన్నికల్లో ఎంపీగా రేవంత్ పోటీ చేశారని గుర్తు చేశారు.

రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మోదీ.. వీరంతా రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసిన విషయాన్ని కూడా తన ట్వీట్ ద్వారా గుర్తు చేశారు మంత్రి కేటీఆర్. సీఎం కేసీఆర్ కూడా రెండు నియోజకవర్గాల్లో పోటీ గురించి ఇప్పటికే క్లారిటీ ఇచ్చారు. పార్టీ నిర్ణయించింది కాబట్టే తాను రెండు చోట్ల నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారాయన. "కేసీఆర్‌ చరిత్ర మీకు తెల్వదు. కరీంనగర్‌, రివర్స్‌ల మహబూబ్‌ నగర్‌ నుంచి ఎంపీగా పోటీ చేసి గెలిచా. కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్‌, నిజామాబాద్‌ జిల్లా నుంచి మంత్రి నన్ను వ్యక్తిగతంగా కోరారు. వాళ్లే కాదు.. ఇంకొన్ని జిల్లాల వాళ్లు కూడా అడిగారు. చివరగా పార్టీ సంప్రదింపులతో కామారెడ్డి ఫిక్స్‌ అయ్యాం. అంతేగానీ.. ఇందులో ఏం ప్రత్యేకత లేదు." అని అభ్యర్థుల ప్రకటన సందర్భంలో స్పష్టం చేశారు సీఎం కేసీఆర్.

Tags:    
Advertisement

Similar News