హైడ్రా కూల్చివేతలపై దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు

హైడ్ర కూల్చివేతల వల్ల ప్రజల మధ్య మేము తిరగలేకపోతున్నామని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.

Advertisement
Update:2025-01-23 16:33 IST

హైడ్ర కూల్చివేతలపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కూల్చివేతలు చేయాలంటే అధికారులు ముందు ఓల్డ్ సిటీ నుండి మొదలు పెట్టడాలని ఎమ్మెల్యే అన్నారు. ఓల్డ్ సిటీలో కూల్చేస్తే మా దగ్గర కూడా కూల్చండని అధికారులకు సూచించారు. కూల్చివేతలపై అధికారులు ఏకపక్షం వ్యవహరిస్తున్నారు అని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇండ్లను అధికారులు తొలిగించడం సరైంది కాదన్నారు. అధికారులు తామే సుప్రీం అనుకుంటున్నారాణి చెప్పారు. అధికారులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తే ఆ ప్రభుత్వాలకు మనుగడ ఉండదన్నారు. రోజూవారి వ్యాపారాలు చేసుకునే పేదలను అధికారులు కూల్చివేతల పేరుతో ఇబ్బంది పెడుతున్నారని వెల్లడించారు.

కుమారి అంటీకి ఒక న్యాయం… సామాన్యులకు మరో న్యాయమా అని ఆయన ప్రశ్నించాడు. సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని ఎమ్మెల్యే దానం తెలిపారు. హైదరాబాద్ ప్రజలకు అన్యాయం జరిగితే చూస్తూ ఉండలేన్నారు. తనకు రాజకీయం ఇచ్చింది హైదరాబాద్‌ కాబట్టి.. తాను ఖైరతాబాద్ నియోజకవర్గానికె పరిమితం కాదు..హైద్రాబాద్ లో ఎక్కడ ప్రజలకు ఇబ్బంది వచ్చినా దానం అన్నా ముందుంటాడు. గతంలో నేను హైడ్రా విషయంలో మాట్లాడిన ఇప్పుడు ఫుట్‌పాత్‌ ల విషయంలో మాట్లాడుతున్న అంటే అది ప్రభుత్వానికి చెడ్డపేరు రావొద్దనేదే నా అభిప్రాయమని ఎమ్మెల్యే దానం తెలిపారు.

Tags:    
Advertisement

Similar News