జాబితాలో పేరు లేదని పురుగుల మందు తాగిన రైతు

ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో తన పేరు లేదని ఓ రైతు పురుగుల మందు తాగాడు

Advertisement
Update:2025-01-23 15:03 IST

తెలంగాణ మంత్రి సీతక్క నియోజకవర్గంలో గ్రామ సభలో అధికారుల ముందే ఓ రైతు ప్రభుత్వ పథకాల అర్హుల జాబితాలో తన పేరు లేదని పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం బుట్టాయి గూడెం గ్రామ సభలో ప్రజా పాలనలో పెట్టిన అర్జీలకు దేనికి అర్హుడను కాలేదని మనస్థాపానికి గురై, అధికారుల ముందే రైతు కుమ్మరి నాగేశ్వరరావు పురుగుల మందు తాగాడు. అయితే అతన్ని అధికారులు, ప్రజలు నిలువరించేందుకు ప్రయత్నించారు.

అప్పటికే అతను పురుగులమందు సగానికి పైగా తాగేయ్యడంతో హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. రైతు పరిస్థితి విషమంగా మారడంతో అంబులెన్సులో ములుగు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతనికి అత్యవసర చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి మాత్రం విషమంగానే ఉన్నట్లు తెలుస్తుంది.

Tags:    
Advertisement

Similar News