పంతాలు పక్కనపెట్టండి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

నగర ప్రజల సమస్యల పరిష్కారంలో GHMCది ముఖ్య పాత్ర అని అన్నారు మంత్రి కేటీఆర్‌. సమన్వయంతో అన్ని శాఖల అధికారులు ఒక్క దగ్గర ఉండాలన్న లక్ష్యంతో వార్డు ఆఫీసులు ఏర్పాటు చేశామన్నారు.

Advertisement
Update:2023-08-07 20:29 IST

పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని అన్నారు మంత్రి కేటీఆర్. మాదకద్రవ్యాల అలవాట్లు తీవ్రమైన నేరాలకు కారణం అవుతాయని చెప్పారు. గంజాయి విక్రయంపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు. GHMC పరిధిలోని పబ్‌ లు, హుక్కా సెంటర్‌ లు, పాఠశాలలు, ఫామ్ హౌస్‌ ల చుట్టూ పోలీసుల నిఘా పెంచాలన్నారు. ఇందుకోసం సీసీ కెమెరాలు పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు కేటీఆర్. GHMC అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు.

పంతాలు వద్దు..

నగర ప్రజల సమస్యల పరిష్కారంలో GHMCది ముఖ్య పాత్ర అని అన్నారు మంత్రి కేటీఆర్‌. సమన్వయంతో అన్ని శాఖల అధికారులు ఒక్క దగ్గర ఉండాలన్న లక్ష్యంతో వార్డు ఆఫీసులు ఏర్పాటు చేశామన్నారు. వార్డు ఆఫీసుల వల్ల సమస్యలు పరిష్కారం కావాలే కానీ, కొత్త ఇబ్బందులు రాకూడదని హెచ్చరించారు. పంతాలకు వెళ్లకుండా ఏ శాఖ అధికారులైనా GHMC అనుమతి తర్వాతే నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

జవహర్‌ నగర్‌ డంప్ యార్డు దాని పరిమితి దాటిపోయిందని, 8 వేల టన్నుల చెత్తతో యార్డ్ నిండిపోయిందన్నారు మంత్రి కేటీఆర్. డంప్ యార్డుల కోసం వ్యవసాయానికి ఉపయోగం లేని భూమిని గుర్తించాలని అధికారులకు సూచించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి భువనగిరి కలెక్టర్లకు డంప్ యార్డ్ ల విషయంలో ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు. చెత్తనుంచి విద్యుత్ ఉత్పత్తి చేసేలా డంప్‌ యార్డ్‌ లు ఉండాలన్నారు. దుండిగల్, ఖానాపూర్, ప్యారా నగర్ డంప్ యార్డ్‌ ల అంశంలో పూర్తి నివేదికను వారంలో సమర్పించాలని అధికారులను ఆదేశించారు మంత్రి కేటీఆర్.

Tags:    
Advertisement

Similar News