వర్షాలతో విలవిల్లాడిన వరంగల్ కు ప్రత్యేక నిధులు
వరంగల్ నగర అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వీటికి అదనంగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(TUFIDC) ద్వారా మరో 250 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు వెంటనే విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.
గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. శనివారం శాసనసభ సమావేశాల అనంతరం కాన్ఫరెన్స్ హాల్ లో ఆయన ఈ సమీక్ష చేపట్టారు. వరంగల్ నగర పరిధిలో ప్రస్తుతం కొనసాగుతున్న వివిధ పనుల పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పలు కీలక సూచనలు చేశారు.
అదనంగా నిధులు..
వరంగల్ నగర అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వీటికి అదనంగా తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్(TUFIDC) ద్వారా మరో 250 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులు వెంటనే విడుదల చేస్తామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. అదనపు నిధులతో నగర ప్రజలకు తక్షణ ఉపశమనం లభించే అత్యంత కీలకమైన మౌలిక వసతులను కల్పించాలని అధికారులను ఆయన ఆదేశించారు.
ఇటీవల వర్షాలకు వరంగల్ పట్ణంలోని పలు లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. వరదనీటి నిర్వహణ, డ్రైనీజీ నిర్వహణ వ్యవస్థలో లోపాలు ఉండటంతో నీరు పట్టణంలో తిష్టవేసింది, ప్రజలు ఇబ్బందులకు గురయ్యారు. దీనిపై దృష్టిపెట్టాలని సూచించారు మంత్రి కేటీఆర్. రికార్డు స్థాయిలో వర్షాలు కురిసినా కూడా వరదనీరు నగరంలో నిల్వ ఉండకుండా చర్యలు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు తగ్గట్టుగా పారిశుధ్య నిర్వహణ వ్యవస్థ ఉండాలని, అందుకే అదనపు నిధులు కేటాయించామని చెప్పారు. వరంగల్ అభివృద్ధి, నగరానికి మౌలిక వసతుల కల్పన విషయంలో రాజీపడొద్దని అధికారులకు సూచించారు మంత్రి.